ఎట్టకేలకు న్యాయపరమైన చిక్కులన్నీ విడిపోయి నిర్భయ కేసు దోషులు నలుగురికి శుక్రవారం తెల్లవారు జామును ఉరి శిక్ష అమలైంది. నలుగురు దోషులను ఒక్కేసారి ఉరితీశారు. అసలు ఏనాడో వీరికి ఉరిశిక్ష పడాల్సి ఉండగా... దోషులు చట్టంలోని లోసుగులన్నింటినీ ఉపయోగించుకోని ఇన్ని రోజులు ఉరిని వాయిదా వేస్తూ వచ్చారు.

ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి వాళ్లు చేయని ప్రయత్నాలంటూ ఏమీ లేవు. కాగా... వాళ్లు ఎన్ని ప్రయాత్నాలు చేసినా చివరకు ఉరికంభం ఎక్కక తప్పలేదు. గతంలో మూడుసార్లు వారికి ఉరిశిక్ష అమలుకు సంబంధించిన డెత్ వారెంట్లు రద్దయ్యాయి. ఉరిశిక్ష అమలును ఆపేందుకు నిర్భయ దోషుల తరఫు న్యాయవాది చివరి వరకు విఫలప్రయత్నం చేశారు. 

Also Read దోషులకు ఉరి... నా కూతురి ఆత్మకు శాంతి :నిర్భయ తల్లి...

ఇప్పటికే మూడుసార్లు ఉరి వాయిదా పడటంతో... ఈసారైనా ఉరి పడుతుందో లేదో అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. అయితే... ఈసారి మాత్రం ఎలాంటి వాయిదా లేకుండా దోషులకు ఉరి పడిపోయింది.

అయితే... ఉరి శిక్షకి ముందు జైలు అధికారులను నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తల్లి అధికారులను ఓ కోరిక కోరింది. చివరిసారిగా తన కుమారుడికి పూరీ, సబ్జి, కచోరీ తినిపించాలని ఉందంటూ ఆమె అధికారులను కోరింది. అయితే... ఆమె కోరికను అధికారులు అంగీకరించారో లేదో మాత్రం తెలియలేదు. 

ఇదిలా ఉంటే... 8 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్న నిర్భయ తల్లి.. దోషులకు ఉరిశిక్ష పడటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత తన కుమార్తె ఆత్మకు శాంతి కలిగిందని ఆమె చెప్పారు. న్యాయం జరగడానికి సమయం పట్టింది కానీ.. ఎట్టకేలకు న్యాయం మాత్రం జరిగిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.