దోషులకు ఉరి... నా కూతురి ఆత్మకు శాంతి :నిర్భయ తల్లి
ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి వాళ్లు చేయని ప్రయత్నాలంటూ ఏమీ లేవు. కాగా... వాళ్లు ఎన్ని ప్రయాత్నాలు చేసినా చివరకు ఉరికంభం ఎక్కక తప్పలేదు. గతంలో మూడుసార్లు వారికి ఉరిశిక్ష అమలుకు సంబంధించిన డెత్ వారెంట్లు రద్దయ్యాయి.
ఎట్టకేలకు న్యాయపరమైన చిక్కులన్నీ విడిపోయి నిర్భయ కేసు దోషులు నలుగురికి శుక్రవారం తెల్లవారు జామును ఉరి శిక్ష అమలైంది. నలుగురు దోషులను ఒక్కేసారి ఉరితీశారు. అసలు ఏనాడో వీరికి ఉరిశిక్ష పడాల్సి ఉండగా... దోషులు చట్టంలోని లోసుగులన్నింటినీ ఉపయోగించుకోని ఇన్ని రోజులు ఉరిని వాయిదా వేస్తూ వచ్చారు.
Also Read నిర్భయ కేసు దోషులకు ఉరి: బోరున విలపించిన వినయ్ శర్మ...
ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి వాళ్లు చేయని ప్రయత్నాలంటూ ఏమీ లేవు. కాగా... వాళ్లు ఎన్ని ప్రయాత్నాలు చేసినా చివరకు ఉరికంభం ఎక్కక తప్పలేదు. గతంలో మూడుసార్లు వారికి ఉరిశిక్ష అమలుకు సంబంధించిన డెత్ వారెంట్లు రద్దయ్యాయి. ఉరిశిక్ష అమలును ఆపేందుకు నిర్భయ దోషుల తరఫు న్యాయవాది చివరి వరకు విఫలప్రయత్నం చేశారు.
ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష అమలును నిలుపుదల చేసేందుకు నిరాకరించడంతో చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయినా సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. సరైన కారణం లేనిదే ఉరిశిక్ష అమలును నిలుపుదల చేయలేమని, తమ సమయాన్ని వృధా చేయొద్దని నిర్భయ దోషుల తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది. దీంతో ముందుగా జారీ అయిన డెత్ వారెంట్ల మేరకు ఈ ఉదయం ఐదున్నర గంటలకు నిర్భయ దోషులు నలుగురిని ఉరితీశారు. అంతకు ముందుగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి...పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్థారించుకున్నారు.
కాగా... గత ఎనిమిది సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిర్భయ తల్లి ఆశాదేవి .. దోషులకు ఉరిశిక్ష వేయడం పట్ల స్పందించారు.ఉరిశిక్షను అమలుచేయడం పట్ల నిర్భయ తల్లి హర్షం వ్యక్తంచేశారు. తమకు న్యాయం జరిగిందన్నారు. తన కుమార్తె ఆత్మకు శాంతి చేకూరుతుందని వ్యాఖ్యానించారు.