అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్ లోకి పాము దూరింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కొయంబత్తూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కోయంబత్తూర్ లోని బరతియార్ యూనివర్శిటీ లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లోకి ఓ పాము దూరింది.  ఓ విద్యార్థిని స్నానానికి బాత్రూమ్ కి వెళ్లగా పాము కనిపించింది. దీంతో.. ఆమె వెంటనే భయపడి బయటకు పరుగులు తీసింది. మిగిలిన విద్యార్థినులకు కూడా ఈ విషయం తెలియజేయగా.. వారు కూడా పామును చూసి భయపడ్డారు.

ఆ పాము దాదాపు ఆరడుగుల పొడవు ఉంది. బాత్రూమ్ లోని వాషింగ్ బేషిన్ నుంచి గోడవైపు పాకుతూ కనిపించింది.  కాగా.. ఆ పాము ఎలా వచ్చింది అనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఆ పాముని ఓ విద్యార్థిని వీడియో తీయగా... ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.

కాగా.. పాము అక్కడకు ఎలా వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు కాలేజీ యాజమాన్యం చెప్పింది. ఇదిలా ఉంటే...  ఆ విద్యార్థినులు మాత్రం.. తమ హాస్టల్ గదుల్లో ఉండాలన్నా... బాత్రూమ్ లోకి వెళ్లాలన్నా భయపడిపోతున్నారు.