పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ పంజాబీ గాయకుడు, రాపర్ సిద్ధూ మూస్ వాలాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో ఈ ఘటన జరిగింది. 

పంజాబ్ (punjab) అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో (congress) చేరిన ప్రముఖ పంజాబీ గాయకుడు, రాపర్ సిద్ధూ మూస్ వాలాను (Sidhu Moosewala ) గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో ఈ ఘటన జరిగింది. జీపులో వెళ్తుండగా ఆయనపై 20 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో సిద్ధూతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలోని వీఐపీలకు పంజాబ్ ప్రభుత్వం (punjab govt) భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది.

1993, జూన్ 17న జన్మించిన శుభదీప్ సింగ్ సిద్ధూ, అలియాస్ సిద్ధూ మూసేవాలాకు రాష్ట్రంలో మిలియన్ల మంది అభిమానులు వున్నారు. మాన్సా జిల్లాలోని మూసా అనే గ్రామానికి చెందిన మూస్ వాలా గతేడాది నవంబర్‌లో అభిమానుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మాన్సా నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన ఆయన ఎన్నికల్లో ఆప్‌కి (aap) చెందిన డాక్టర్ విజయ్ సింగ్లా చేతిలో 63,323 ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే నాజర్ సింగ్ మన్షాహియా.. మూసా అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీపై తిరుగుబాటు చేశారు. 

అవినీతి ఆరోపణల నేపథ్యంలో విజయ్ సింగ్లాను ఇటీవల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann ) పదవి నుంచి తొలగించారు. గత నెలలో సిద్ధూ మూసేవాలా తన తాజా ఆల్బమ్ ‘‘బలి పశువు’’లో ఆమ్ ఆద్మీ పార్టీని, దాని మద్ధతుదారులను లక్ష్యంగా చేసుకున్నాడు. అంతేకాదు సదరు పాటలో ఆప్ మద్ధతుదారులను ద్రోహులుగా అభివర్ణించాడు. 

Also Read: పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 424 మంది వీఐపీలకు సెక్యూరిటీ రద్దు

ఇకపోతే.. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం నిన్న రాష్ట్రంలోని 424 మంది వీఐపీలకు తక్షణమే (vip security) సెక్యూరిటీ కవర్‌ను రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. వీరందరికీ సెక్యూరిటీగా ఉన్న రక్షణ సిబ్బంది వెంటనే జలందర్‌ కంటోన్మెంట్‌లో ప్రత్యేక డీజీపీకి రిపోర్ట్ చేయాలని శనివారం ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ పోలీసు అధికారులు, ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నేతలు సహా పలువురు సెక్యూరిటీ కవర్ ఈ ఆదేశాలతో రద్దు అయ్యాయి. మొత్తం నాలుగు దఫాలుగా సెక్యూరిటీ రద్దు నిర్ణయాన్ని పంజాబ్ ప్రభుత్వం అమలు చేసింది.

ఈ నెల తొలినాళ్లలో భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం తొలుత ఎనిమిది మందికి సెక్యూరిటీని రద్దు చేసింది. ఇందులో కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్; బీజేపీ నేత సునీల్ జాఖడ్‌లు ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో ఐదుగురికి జెడ్ సెక్యూరిటీ లెవెల్ ఉంది. మిగతా ముగ్గురికి వై ప్లస్ గ్రూప్ సెక్యూరిటీ ఉంది. ఈ ఎనిమిది మందిని 127 మంది పోలీసు అధికారులు గార్డ్ చేశారు. తొమ్మిది పోలీసు వాహనాలు వీరి రక్షణ కోసం పని చేశాయి.

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, లోక్ సభ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, మాజీ కాంగ్రెస్ ఎంపీ సునీల్ జాఖడ్, కేంద్ర మాజీ క్యాబినెట్ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాలు సెక్యూరిటీ కవర్ ఎత్తేసిన జాబితాలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు పర్మింద్ సింగ్ పింకీ, రాజిందర్ కౌర్ భట్టాల్, నవతేజ్ సింగ్ చీమ, కేవాల్ సింగ్ ధిల్లియన్‌లు ఈ లిస్టులో ఉన్నారు.