Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ ఘటన: ఏడున్నర గంటలు కష్టపడి తెగిన పోలీసు చేతిని అతికించిన డాక్టర్లు

లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు పోలీసులు ఆపడంతో ఆగ్రహించి పోలీసు అధికారి చేతిని సదరు నిహంగ్ కత్తితో నరికిన విషయం తెలిసిందే. ఆ గాయపడ్డ పోలీసు అధికారి మొక్కువోని ధైర్యంతో హాహాకారాలు లేకుండా ఆ తెగిపడిన చేతిని మరో చేతిలో పట్టుకొని ఆసుపత్రికి వెళ్లిన విషయం తెలిసిందే. 

Punjab Nihangs attack Incident: Doctors at PGI operate for 7and half hours to fix the hand of injured ASI
Author
Chandigarh, First Published Apr 12, 2020, 8:17 PM IST

లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు పోలీసులు ఆపడంతో ఆగ్రహించి పోలీసు అధికారి చేతిని సదరు నిహంగ్ కత్తితో నరికిన విషయం తెలిసిందే. ఆ గాయపడ్డ పోలీసు అధికారి మొక్కువోని ధైర్యంతో హాహాకారాలు లేకుండా ఆ తెగిపడిన చేతిని మరో చేతిలో పట్టుకొని ఆసుపత్రికి వెళ్లిన విషయం తెలిసిందే. 

పిజిఐ చండీగడ్ వైద్యులు ఏడున్నర గంటలపాటు శ్రమించి అతనికి శస్త్ర చికిత్స పూర్తిచేశారని, సదరు పోలీసు అధికారి హర్జీత్ సింగ్ కోలుకుంటున్నాడని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ తెలిపారు. చాలా కష్టపడి ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేసిన డాక్టర్లకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. 

ఘటన పూర్వాపరాలు... 

పంజాబ్ రాష్ట్రంలోని పాటియాల జిల్లాలో ఆదివారంనాడు ఉదయం కొందరు దాడి చేయడంతో ఓ ఎస్ఐతో పాటు మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

లాక్‌డౌన్ కారణంగా వాహనాలు తిరగకుండా పోలీసులు రోడ్లపై బారికేడ్లు పెట్టారు. బారికేడ్లను ఢీకొడుతూ  వాహనం ముందుకు వెళ్లింది. ఈ విషయాన్ని ప్రశ్నించిన పోలీసులను ఓ వ్యక్తి కత్తితో దాడికి దిగాడు. 

ఈ ఘటనలో  ఎస్ఐ హర్జీత్ సింగ్  గాయపడ్డాడు.అతడిని ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు పోలీసులు కూడ గాయపడ్డారు. ఆదివారం నాడు ఉదయం ఆరు గంటల సమయంలో  కూరగాయల మార్కెట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.

also read:ఇండియాలో 24 గంటల్లో 909 కరోనా కొత్త కేసులు, మొత్తం 8356కి చేరిక

పోలీసులపై దాడి చేసిన వారు పారిపోయారు. దాడి చేసిన వారిని లొంగిపోవాలని పోలీసులు కోరారు. స్థానిక పెద్దలు, సర్పంచ్ ద్వారా ఓ ప్రార్ధన మందిరంలో దాక్కొన్న నిందితులు పోలీసులు లొంగిపోయారు.ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురిని  అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. 

కరోనాను నివారించేందుకు గాను లాక్ డౌన్ ను పొడిగిస్తూ  పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శుక్రవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు. దేశంలో ఇప్పటికే ఒడిశా, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాయి. పంజాబ్ రాష్ట్రంలో 151 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 11 మంది మరణించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios