న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం నాటికి 8356 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే 909 కొత్త కేసులు నమోదైనట్టుగా రికార్డులు చెబుతున్నాయి.

కరోనా వ్యాధి సోకిన రోగులు ఆసుపత్రిలో చికిత్స పొంది 715 మంది డిశ్చార్జ అయినట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.ఈ వ్యాధి సోకి సుమారు 273 మంది మృతి చెందినట్టుగా ప్రభుత్వం తెలిపింది.

also read:ఇండియాలో వేయికి పైగా కొత్త కేసులు: మొత్తం కేసులు 7 వేల పైనే, మరణాలు 239

దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రంలో ఆదివారం నాడు ఉదయానికి 1761 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో 1069 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 969 కేసులు. రాజస్థాన్ లో 700, తెలంగాణలో 504 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

శనివారం నాటికి దేశంలోని 1.79 లక్షల మంది శాంపిల్స్ ను పరీక్షించినట్టుగా  ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్స్ ప్రకటించింది.


దేశంలోని ఆయా రాష్ట్రాల్లో నమోదైన కేసుల వివరాలు


అరుణాచల్ ప్రదేశ్-01
ఆంధ్రప్రదేశ్-405
అండమాన్ నికోబార్ -11
అసోం-29
బీహార్-63
ఛత్తీస్ ఘడ్-18
ఢిల్లీ-1069
గోవా-07
గుజరాత్-432
హర్యానా-177
హిమాచల్‌ప్రదేశ్-32
జమ్మూకాశ్మీర్-207
జార్ఖండ్-17
కర్ణాటక-214
కేరళ-364
లడఖ్-15
మధ్యప్రదేశ్-532
మహారాష్ట్ర-1761
మణిపూర్-02
మిజోరాం-01
ఒడిశా-50
పాండిచ్చేరి-07
పంజాబ్-151
రాజస్థాన్-700
తమిళనాడు-969
తెలంగాణ-504
త్రిపుర-02
ఉత్తరాఖండ్-35
ఉత్తర్ ప్రదేశ్-452
పశ్చిమ బెంగాల్-134
చంఢీఘడ్-19

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ ను పొడిగించాయి. ప్రధానమంత్రి మోడీ శనివారం నాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ కాన్పరెన్స్ లో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో లాక్ డౌన్ గురించి చర్చించారు.