పంజాబ్‌లో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. పిల్లలను కనాలని విసిగించిన పొరుగింటిలోని అందరినీ ఓ వ్యక్తి దారుణం చంపేశాడు. అంతేకాదు, పోలీసులను తన భార్యను కూడా అరెస్టు చేయాలని కోరడం గమనార్హం. 

పిల్లల్ని కనాలని పొరుగింటి కుటుంబం రొధ పెట్టేది. ఎప్పుడు కనిపించినా సంతానానికి ప్లాన్ చేసుకున్నారా? అని అడిగేవారు. ఇంకెప్పుడు పిల్లలను కంటారు అంటూ భార్య ముందే భర్తను అడగేవారు. వాళ్లు ఇది చాలా సహజంగా అడిగారు. కానీ, భార్య ముందు ఆ ప్రశ్న ఎదుర్కోవడం ఆ వ్యక్తి జీర్ణించుకోలేకపోయాడు. ఓ రోజు పొరుగింటికి వెళ్లి మరీ ఆ ఇంట్లోని ముగ్గురిని సుత్తెతో మోది చంపేశాడు. పోలీసులు ఆయనను అరెస్టు చేసిన తర్వాత కూడా విచిత్ర డిమాండ్ చేశాడు. తన భార్యను చూసుకోవడానికి ఇప్పుడు బయట ఎవరూ లేరని, కాబట్టి ఆమెను కూడా జైలుకు పంపిస్తే.. ఇక్కడ ఇద్దరం ఉంటామని నిందితుడు చెప్పడం గమనార్హం. ముగ్గురిని హతమార్చిన పశ్చాత్తాపమేమీ నిందితుడి ముఖంలో కనిపించలేదని పోలీసులు చెప్పడం గమనార్హం. ఈ ఘటన పంజాబ్ లూధియానాలోని సేలం తబ్రీ లోకాలిటీకిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సీపీ మందీప్ సింగ్ సిద్దూ రిపోర్టర్లతో మాట్లాడుతూ.. ఒక మహిళ, ఆమె భర్త, ఆమె అత్త మరణించినట్టు తెలిపారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చిందని వివరించారు. 

ఇ-రిక్షా డ్రైవర్ మున్నా ఇంటి పక్కనే సురీందర్ కౌర్ (70), ఆమె భర్త ఛమన్ లాల్ (75), ఆమె అత్త (90 ఏళ్లు) ఉంటున్నారు. వారి పిల్లలంతా విదేశాల్లో ఉన్నారు. సురీందర్ కౌర్ తరుచూ మున్నా వద్దకు వెళ్లి పిల్లలను కనాలని విసిగించేది. చాలా సార్లు మున్నాను ఆయన భార్య ముందే పిల్లలను కనాలని సూచిస్తూ ఉండేది. ఇది మున్నాకు నచ్చేది కాదు.

ఓ రోజు వారి ఇంటిలోకి సుత్తె పట్టుకుని వెళ్లాడు. వారందరినీ సుత్తెతో మోది చంపేశాడు. ఆ తర్వాత దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రించాలని అనుకున్నాడు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాల్వ్ ఓపెన్ చేశాడు. అగర్ బత్తులను వెలిగించి వచ్చాడు. ఈ ప్రయత్నం విఫలమైంది.

Also Read: అలాగైతే పాకిస్తాన్ టీమ్ ఇండియాలో పర్యటించదు: వరల్డ్ కప్ పై పాకిస్తాన్ క్రీడా శాఖ మంత్రి సంచలనం

ఇంటికి పాలు పోయడానికి గురువారం పాలబ్బాయి వచ్చాడు. ఎంత సేపు డోర్ కొట్టినా తెరవలేదు. మరుసటి రోజు కూడా వచ్చినా అలాగే లోపలి వైపు గడి పెట్టి ఉన్నట్టు గుర్తించాడు. కానీ, డోర్ తీయడం లేదని గ్రహించాడు. అనుమానంతో చుట్టుపక్కల అలర్ట్ చేశాడు. ఇరుగుపొరుగు వారు ముందటి గోడ ఎక్కి లోనికి వెళ్లారు. దీంతో ఇంటిలో ఉండే ముగ్గురూ విగతజీవులై కనిపించారు. 

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మున్నాను అరెస్టు చేసి విచారింగా.. నేరాన్ని అంగీకరించాడు. పశ్చాత్తాపాన్ని ఇంతైనా ప్రకటించలేదు. అంతేకాదు, తన భార్యను కూడా అరెస్టు చేయాలని పోలీసులను కోరాడు. తాను జైలులో ఉంటే తన భార్యను చూసుకునేవారెవరూ లేరని అన్నాడు.