Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డిది ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండే... పంజాబ్ మాజీ సీఎం వివాదాస్పదం...

 revanth reddy మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోల్ ఆరెస్సెస్ నుంచి కాకపోతే ఎక్కడి నుంచి వచ్చారని అమరీందర్ ప్రశ్నించారు. సిద్ధూ పద్నాలుగేళ్లు బీజేపీలో ఉన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. 

punjab former cm amarinder singh comments on tpcc chairman revanth reddy
Author
Hyderabad, First Published Oct 22, 2021, 9:52 AM IST

చండీగఢ్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Telangana PCC President రేవంత్ రెడ్డి RSS నేపథ్యం నుంచే వచ్చారని వ్యాఖ్యానించారు. 

Amarinder Singh సొంత పార్టీ పెట్టి బీజేపీతో సీట్ల సర్దుబాటు చేసుకోనున్నారనే వార్తలు వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ అమరీందర్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

అమరీందర్ తనలోని సెక్యులరిస్టును చంపేసుకున్నారంటూ Harish Rawat చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం స్పందించారు. revanth reddy మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోల్ ఆరెస్సెస్ నుంచి కాకపోతే ఎక్కడి నుంచి వచ్చారని అమరీందర్ ప్రశ్నించారు. సిద్ధూ పద్నాలుగేళ్లు బీజేపీలో ఉన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. 

ఇదిలా ఉండగా, హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఇంటికో ఓటు కాంగ్రెస్‌కు వేయండి అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. హుజురాబాద్ ఎన్నికల ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలతో టీపీసీసీ అధ్యక్షుడు Revanth Reddy గురువారం నాడు భేటీ అయ్యారు.

రానున్న  వారం రోజుల పాటు చేయాల్సిన ప్రచార వ్యూహాలపై పార్టీ నేతలతో  రేవంత్ చర్చలు జరిపారు. హుజురాబాద్ ఎన్నికలలో నిరుద్యోగ యువత, విద్యార్థులను, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఉండాలని ఆయన సూచించారు. 

ఇదే లాస్ట్‌ ఛాన్స్‌.. మీతో మాట్లాడాలి, అపాయింట్‌మెంట్ ఇస్తారా: సోనియాగాంధీకి సిద్ధూ లేఖ

Congress పార్టీ ఒక యువ నాయకుడికి, విద్యార్థి నేతకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని యువతలోకి తీసుకెళ్లాలన్నారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలనే విషయమై ఓటర్లకు వివరించాలని ఆయన నేతలను కోరారు.

Bjp, టీఆర్‌ఎస్‌ల మోసపూరిత విధానాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేసిన నష్టాలను వివరించాలని నేతలకు తెలిపారు.బీజేపీ, Trs లోపాయికారి ఒప్పందాలను చీకటి రాజకీయాలను బయటపెట్టి కాంగ్రెస్ వైపు ప్రజలు ఉండేలా ప్రచార వ్యూహాలను అమలు చేయాలని నేతలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు.

ఈ ఉప ఎన్నికలకు కారణం ఎవరు, దళిత బంధును అడ్డుకున్నదెవరనే విషయాలపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని పార్టీ విషయమై కూడ లోతుగా చర్చ జరగాలన్నారు.  

ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డి, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 30వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఏడాది జూన్ 12న హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ బరిలోకి దిగాడు. బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్ధిగా  గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో నిలిచాడు.

Follow Us:
Download App:
  • android
  • ios