మళ్లీ పంజాబ్ రైతుల నిరసన.. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ రైల్ రోకో..
తమకు ఇచ్చిన పలు హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా నెరవేర్చలేదంటూ పంజాబ్ రైతులు మళ్లీ నిరసన చేపట్టారు. మూడు గంటల పాటు రైలు పట్టాలపై కూర్చొని రైల్ రోకో చేపట్టారు.

కేంద్రం ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పేర్కొంటూ పంజాబ్ లో రైతులు నిరసన చేపట్టారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో మూడు గంటల పాటు ఆందోళన చేపట్టారు. ఆయా జిల్లాలో మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు 3 గంటల పాటు రైళ్ల రాకపోకలను నిలిపివేసి రైల్ రోకో చేపట్టారు.
జాతీయ జెండా కంటే ఎత్తులో కటౌట్: రాహుల్ పై నెటిజన్ల మండిపాటు
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2021 జనవరిలో సింగు సరిహద్దులో నిరసన తెలుపుతున్న వారిపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ రైతులు ఈ నిరసన చేపట్టారు. విద్యుత్ సవరణ బిల్లు ముసాయిదాను రద్దు చేయడం, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)తో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను విడనాడాలని కూడా ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ తీరును కూడా రైతులు నిరసరించారు. చెరకు పంటలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రైతుల చెల్లింపులను క్లియర్ చేయాలని, రహదారి ప్రాజెక్టుల కోసం భూములు సేకరిస్తున్న రైతులకు తగిన నష్టపరిహారం వంటివి ఇవ్వాలని కోరారు. కాగా.. పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌లపై వివిధ జిల్లాల డిప్యూటీ కమిషనర్లతో నవంబర్, డిసెంబర్ నెలల్లో కేఎంఎస్ సీ సమావేశాలు నిర్వహించింది. డిసెంబర్ మొదటి వారంలో ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్‌తో కూడా సమావేశమైంది.
భూమిలోంచి నీటిని తోడితే పన్ను , పంజాబ్ సర్కార్ సంచలన నిర్ణయం, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి
“మా సమావేశాలు ఏవీ ఫలించలేదు. చట్టపరమైన హామీగా పంటలకు కనీస మద్దతు ధర ( ఎంఎస్‌పి ) కోసం మేము నిరసనలు చేస్తున్నాము , జిరా మద్యం ఫ్యాక్టరీపై స్పష్టత, రైతులకు మెరుగైన పరిహారం మరియు చెరకు రైతులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయండి. టోల్ ప్లాజాల కోసం, ప్రభుత్వం వినియోగదారు ఛార్జీలను తగ్గించాలని మరియు కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు రోడ్డు పన్ను వసూలు చేయకూడదని మేము కోరుకుంటున్నాము. నష్టాలు అని పిలవబడే పేరుతో టోల్ కంపెనీలు వినియోగదారు రుసుమును పెంచకుండా మేము నిర్ధారించాము. టోల్ కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే మేము ధర్నాలను పునఃప్రారంభిస్తాము, ”అని పంధర్ అన్నారు.