జాతీయ జెండా కంటే ఎత్తులో కటౌట్: రాహుల్ పై నెటిజన్ల మండిపాటు
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కటౌట్ జాతీయ జెండా కంటే పెద్దదిగా ఏర్పాటు చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యూఢిల్లీ: తన కటౌట్ కంటే జాతీయ పతాకం చిన్నదిగా ఉండడంపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర ముగింపును పురస్కరించుకొని జబ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో లాలూ చౌక్ లో ఆదివారం నాడు ఆవిష్కరించారు.
జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రాంతంలో రాహుల్ గాంధీ కటౌట్ పెద్దదిగా కన్పించింది. జాతీయ జెండా కంటే రాహుల్ గాంధీ కటౌట్ పెద్దదిగా ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు మండిపడుతున్నారు. జాతీయ జెండా కంటే రాహుల్ గాంధీ కటౌట్ ఎత్తులో ఎలా ఉంచుతారని ప్రశ్నిస్తున్నారు.
గత ఏడాది సెప్టెంబర్ మాసంలో భారత్ జోడో యాత్ర తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ప్రారంభమైంది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో ఈ యాత్ర ముగిసింది. యాత్ర ముగింపును పురస్కరించుకొని రేపు శ్రీనగర్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు పలు పార్టీల నేతలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపింది. అయితే కొందరు నేతలు ఈ సభకు వెళ్లేందుకు అనాసక్తిని చూపుతున్నారు.