పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 92 స్థానాల్లో విజయం సాధించింది. ఒకే పార్టీకి ఇంత మెజారిటీ రావడం 60 ఏళ్లలో ఇదే తొలిసారి. 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 90 స్థానాలు సాధించింది.
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) అఖండ విజయం సాధించింది. ఏళ్ల నుంచి అక్కడ పాతుకుపోయిన కాంగ్రెస్ (congress) పార్టీని చీపురుతో ఊడ్చేసింది. కిందటి ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ సారి మొదటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దీంతో పంజాబ్ (punjab) ప్రజలు ఆ పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చారు. ఏకంగా 92 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీకి కట్టపెట్టారు. దీంతో ఆప్ 60 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.
పంజాబ్ లో గతంలో జరిగిన ఎన్నికలను గమినస్తే కాంగ్రెస్ ప్రాభల్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ సార్లు ఆ పార్టీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొన్ని సార్లు అకాళీదల్ సొంతగా, మరి కొన్ని సార్లు బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. ఈ సారి ఆ మూడు పార్టీలకు ఆప్ చోటు ఇవ్వలేదు. 117 సీట్లు ఉన్న పంజాబ్ అసెంబ్లీని క్లీన్ స్వీప్ చేసింది. 92 సీట్లలో విజయం సాధించింది. అయితే పంజాబ్ లో గత 60 ఏళ్లలో ఏ పార్టీకి ఇంత పెద్ద స్థాయిలో మెజారిటీ రాలేదు. 1962లో పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలు కైవసం చేసుకుంది. తరువాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా స్థానాలు గెలుపొందలేదు. నిన్న వెల్లడించిన ఫలితాల్లో ఆప్ ఆ రికార్డును సొంతం చేసుకుంది. అయితే 1997లో మాత్రం బీజేపీ-అకాలీదళ్ కలిసి 93 స్థానాలు సాధించాయి. కానీ ఒంటరిగా ఒకే పార్టీకి ఇంతలా మెజారిటీ రావడం 60 ఏళ్లలో ఇదే తొలిసారి.
ఈ సారి నిర్వహించిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులను కూడా ఓడించింది. ప్రస్తుత సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ(charanjith singh channi) రెండు స్థానాల నుంచి ఓడిపోయారు. అలాగే కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ (amarinder singh) కూడా ఓటమి పాలయ్యారు. అలాగే మరో సీనియర్ నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్ కూడా అపజయం పొందారు. ఈ ఎన్నికల్లో అకాలీదళ్-బహుజన్ సమాజ్ వాదీ పార్టీతో కలిసి పోటీ చేసింది. ఆ కానీ పొత్తు ప్రభావం చూపలేకపోయింది. నిజానికి అకాలీదళ్ కు పంజాబ్ లో పట్టు ఉండేది. ఒక సారి సొంతంగా, రెండు సార్లు బీజేపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కేంద్రంలోని బీజేపీ తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను ఆ పార్టీ వ్యతిరేకించింది. దీంతో బీజేపీతో సంబంధాలు తెంచుకుంది. దీంతో బీజేపీ ఒంటరిగా, అకాలీదల్-బీఎస్పీ కలిసి పోటీ చేశాయి. కానీ రెండు పార్టీలు కనీసం రెండెంకల స్థానాలను కూడా దాటలేకపోయాయి.
మొత్తంగా పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు సాధించగా కాంగ్రెస్ 18, SAD 3, BJP 2, BSP 1 స్థానం గెలుచుకుంది. ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించాడు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. పార్టీ స్థాపించిన అతి తక్కువ వ్యవధిలో రెండో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీగా ఆప్ చరిత్ర సృష్టించింది.