Punjab Assembly Election 2022: తాను నిజాలు మాత్రమే మాట్లాడగలనని, తప్పుడు వాగ్దానాలు చేయలేనని, ఎవరైనా అబద్ధపు వాగ్దానాలను వినాలనుకుంటే... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రసంగాలను వినవలసి ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాహుల్ ఎద్దేవా చేశారు. 

Punjab Assembly Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. పంజాబ్‌లో ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ప్ర‌ధాన పార్టీలు తీవ్రంగా క‌ష్ట‌పడుతున్నాయి. దీంతో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్(Congress) కూడా పూర్తి బలాన్ని ప్రయోగిస్తోంది.

తాను నిజాలు మాత్రమే మాట్లాడగలనని, తప్పుడు వాగ్దానాలు చేయలేనని, ఎవరైనా అబద్ధపు వాగ్దానాలను వినాలనుకుంటే... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రసంగాలను వినవలసి ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాహుల్ ఎద్దేవా చేశారు. తాము గ‌న‌క అధికారంలోకి వ‌స్తే పంజాబ్‌ను వేధిస్తోన్న డ్ర‌గ్స్ స‌మ‌స్య‌ను రూపుమాపేస్తామ‌ని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

పంజాబ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాహుల్ గాంధీ మంగ‌ళ‌వారం నాడు పాటియాలా జిల్లాలోని రాజ్‌పురాలో చేప‌ట్టిన 'నవీ సోచ్ నవ పంజాబ్ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ ర్యాలీ లో ఆయన మాట్లాడుతూ.. పంజాబ్‌లో శాంతి నెలకొనేందుకు తన ప్రాణాలను ఇవ్వగలన‌ని అన్నారు. 

రాహుల్ సోమవారం ఓ సభలో మాట్లాడుతూ.. “ఇది కెమిస్ట్రీ ల్యాబ్ కాదు... ఇక్కడ మీరు ప్రయోగాలు చేయవచ్చు. ఇది సరిహద్దు రాష్ట్రం, సున్నితమైన రాష్ట్రం. కాంగ్రెస్ పంజాబ్‌ను అర్థం చేసుకుని ఇక్కడ శాంతిని కాపాడుతుంది. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. అని ఓట‌ర్లకు విజ్ఞ‌ప్తి చేశారు. తాను తప్పుడు వాగ్దానాలు చేయలేనని, ఎవరైనా త‌ప్పుడు వాగ్వాదాల‌ను వినాలనుకుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అకాలీ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రసంగాలు వినాలని ఆయన అన్నారు.

పంజాబ్ ప్రమాదం నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ సమైక్యంగా నడవాలని చెప్పారు. సరిహద్దుల్లో ఉన్న పంజాబ్‌లో శాంతిభద్రతలను కాపాడుకోవడం చాలా ముఖ్యమని, తన పార్టీ మాత్రమే చేయగలదని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలదని అన్నారు.

కాంగ్రెస్ నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీని నిరుద్యోగం గురించి కూడా లక్ష్యంగా చేసుకున్నారు, ఆయన ఎన్నికల ప్రసంగాలలో దాని గురించి మరియు నల్లధనం గురించి మాట్లాడరు. రాష్ట్రంలో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే పంజాబ్ నుండి డ్రగ్స్ సమస్య పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని గాంధీ హామీ ఇచ్చారు.కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రంలో ప్రశాంతతను కాపాడగలదని తెలిపారు. పంజాబ్‌ను కాంగ్రెస్ బాగా అర్థం చేసుకోగలదని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని చెప్పారు. 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌మ‌నే ఆద‌రించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. నిరుద్యోగిత రాను రాను తీవ్రంగా పెరిగిపోతున్నా, ప్ర‌ధాని మోదీ మాత్రం నల్లధనం, నిరుద్యోగం గురించి మాట్లాడటం లేదని విమ‌ర్శించారు. ఇత‌ర పార్టీల్లాగా తాము త‌ప్పుడు హామీలిచ్చి, ప్ర‌జ‌ల‌ను మోస‌గించ‌మ‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు.