Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ సంక్షోభం: కాంగ్రెస్ అధిష్ఠానం బుజ్జగింపులు.. సిద్ధూతో పంజాబ్ సీఎం భేటీ

పంజాబ్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన నవజోత్ సింగ్ సిద్ధూను బుజ్జగించడానికి అధిష్ఠానం రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా సిద్ధూతో.. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చర్చలు జరపనున్నారు

punjab congress crisis navjot singh sidhu to meet chief minister channi
Author
New Delhi, First Published Sep 30, 2021, 4:01 PM IST

పంజాబ్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన నవజోత్ సింగ్ సిద్ధూను బుజ్జగించడానికి అధిష్ఠానం రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా సిద్ధూతో.. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చర్చలు జరపనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు సిద్ధూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చన్నీ తనను చర్చలకు ఆహ్వానించారని సిద్ధూ ట్వీట్‌లో పేర్కొన్నారు. చండీగఢ్‌లోని పంజాబ్ భవన్‌లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ చర్చలు జరగనున్నాయి. ఆయనతో ఎలాంటి చర్చలకైనా తాను సిద్ధమని సిద్ధూ పేర్కొన్నారు.

ALso Read:కాంగ్రెస్‌లో వుండలేను.. బీజేపీలో చేరలేను: కొత్త పార్టీ దిశగా అమరీందర్ సింగ్ ..?

మరోవైపు పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అమరీందర్ సింగ్ వరుస భేటీలు నిర్వహిస్తుననారు.. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో నిన్న భేటీ అయిన అమరీందర్ సింగ్.. ఈరోజు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో సమావేశమయ్యారు. అమరీందర్ సింగ్.. భాజపాలో చేరే అవకాశం ఉందని పలు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. అయితే అమరీందర్ సింగ్ భార్య ప్రీణీత్ కౌర్‌కు పీసీసీ చీఫ్ పదవి వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios