Asianet News TeluguAsianet News Telugu

Punjab Election 2022 : ‘నేను సేవకుడిని మాత్రమే.. ఆయన సీఎం అభ్యర్థి అయినా ఓకే’.. ఛన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు..

కాంగ్రెస్ పార్టీకి తాను ఒక సేవకుడినని.. అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తారని స్పష్టం చేశారు. సిద్దు తనకు సోదరుడు లాంటివాడు అని.. దీనిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు.  ఈ సందర్భంగా చన్నీ.. మాజీ సీఎం Amarinder Singh పై ఆరోపణలు గుప్పించారు.

Punjab CM Channi says 'no problem' if Congress names Sidhu as CM candidate
Author
Hyderabad, First Published Jan 22, 2022, 7:14 AM IST

చండీఘడ్ : పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సిఎం Charanjit Singh Channi, పీసీసీ అధ్యక్షుడు Navjot Singh Sidhuలు తమ ఆధిపత్యం కోసం పోటాపోటీగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, సీఎం చన్నీ ఓ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఈసందర్భంగా ఒక ఇంటర్వ్యూలో.. ‘త్వరలో జరగనున్న ఎన్నికల్లో Congress high command పంజాబ్ CM candidateగా.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరును యోచిస్తోందా?’ అని ఒక విలేకరి ప్రశ్నించారు. దీనిపై చన్నీ తనదైన శైలిలో స్పందించారు..

కాంగ్రెస్ పార్టీకి తాను ఒక సేవకుడినని.. అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తారని స్పష్టం చేశారు. సిద్దు తనకు సోదరుడు లాంటివాడు అని.. దీనిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు.  ఈ సందర్భంగా చన్నీ.. మాజీ సీఎం Amarinder Singh పై ఆరోపణలు గుప్పించారు. కాగా, ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ Arvind Kejriwal పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ప్రకటించడంపై కూడా స్పందించారు.  కేజ్రీవాల్ పంజాబ్ నుంచి నాయకుడిగా ఎదగాలి అన్నారు.

పంజాబ్ ప్రజల నుంచి తగినంత మద్దతు లేకపోవడంతో చివరి నిమిషంలో భగవంత్ మాన్ పేరును ప్రతిపాదించారని తెలిపారు. కాగా చన్నీ తాను పోటీకి దిగుతున్న chamkaur sahib స్థానం నుంచి ఓడిపోతారని కేజ్రీవాల్ విమర్శించారు. అదే సమయంలో ఛన్నీ మేనల్లుడి ఇంట్లో కోట్లాది రూపాయలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే. పంజాబ్ లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

ఇదిలా ఉండగా, పంజాబ్ లో జనవరి 18న ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు నిర్వహించింది. పంజాబ్‌లో ఎన్నికల వేళ Enforcement Directorate అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మేనల్లుడు Bhupinder Singh Honey ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇంటితో పాటు పంజాబ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో జనవరి 18వ తేదీ ఉదయం సోదాలు జరిగాయి.

అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్న కంపెనీలపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ దాడులు చేసిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 10 నుంచి 12 చోట్ల దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. 

అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో సంబంధాలు ఉన్న ఉన్న పలువురిని విచారిస్తున్నారు. అయితే ఈ దాడులకు కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల్లో తమను ఎదుర్కొలేకనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ దాడులకు పాల్పుడుతుందని ఆరోపించింది. 

ఇక, కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించబడిన తర్వాత కాంగ్రెస్‌ను వీడిన అమరీందర్ సింగ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఇసుక అక్రమ వ్యాపారంలో పాలుపంచుకున్నారని ఆరోపించారు. అటువంటి ఎమ్మెల్యేల గురించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా తెలియజేసినట్టుగా చెప్పుకొచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios