Asianet News TeluguAsianet News Telugu

punjab assembly polls : నరేంద్ర మోడీని కలిసిన పంజాబ్ బీజేపీ నేతలు.. అసెంబ్లీ ఎన్నికల వ్యూహాంపై చర్చ

వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు (punjab assembly polls) జరుగనుండటంతో అన్ని  పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలపై దృష్టి సారించాయి. ఇప్పటికే కొన్ని పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి కూడా. ఈ క్రమంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఆదివారంనాడు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) కలిశారు.

punjab bjp leaders meet pm narendra modi over assembly polls
Author
New Delhi, First Published Nov 14, 2021, 3:08 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు (punjab assembly polls) జరుగనుండటంతో అన్ని  పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలపై దృష్టి సారించాయి. ఇప్పటికే కొన్ని పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి కూడా. ఈ క్రమంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఆదివారంనాడు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) కలిశారు. రైతు నిరసనలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, కర్తార్‌పూర్ కారిడార్ (kartarpur corridor) తదతర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం. బీజేపీ పంజాబ్ అధ్యక్షుడు అశ్విన్ కుమార్ శర్మ, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు హర్జీత్ సింగ్ గ్రెవల్ ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.

అంతకుముందు  నవంబర్ 7న అశ్విన్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 117 సీట్లలోనూ పోటీ చేస్తుందని చెప్పారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లతో సంపూర్ణ మెజారిటీ సాధించింది. దీంతో అకాలీదళ్-బీజేపీ కూటమి పదేళ్ల పాలనకు తెరపడినట్లయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీ 20 సీట్లు గెలుచుకుని రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. శిరోమణి అకాలీదళ్ 15 సీట్లకు, బీజేపీ 3 సీట్లకు పరిమితమయ్యాయి.

ఈ ఎన్నికల్లో సినీ నటుడు, Sonu Sood సహోదరి Malvika Sood పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూద్ వెల్లడించారు. పంజాబ్‌లోని మోగా పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోనూసూద్ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే, ఆమె ఏ పార్టీలో చేరబోతున్నదనే విషయాన్ని తెలుపలేదు. ఏ Political Partyలో చేరుతున్నారనే విషయం పెద్దగా చూడాల్సిన పనిలేదని, కానీ, ఆమె ఏ పాలసీతో రాజకీయంలోకి ప్రవేశిస్తున్నారన్నదే ముఖ్యమైన అంశమని అన్నారు. దీనితోపాటు ఆయన పొలిటికల్ ఎంట్రీపైనా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఎప్పటికీ సమాజ సేవ చేస్తూనే ఉంటారని, ఐటీ దాడులైనా.. మరే ఇతర కారణాలైన ఆ సేవ నిలిపేయడం జరగదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి ప్రవేశంపై ఆసక్తి లేదని వివరించారు. అంతేకాదు, Padma Shri award తనకు రాకపోవడంపైనా స్పందించారు.

Also Read:పంజాబ్ ఎన్నికల్లో సోనూసూద్ సోదరి పోటీ.. పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ.. పద్మ శ్రీ రాకపోవడంపైనా స్పందన

విద్య, ఆరోగ్యంపైనే తమ కుటుంబం ఎక్కువగా ఫోకస్ పెడుతుందని సోనూసూద్ అన్నారు. తాను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సే లేదని తెలిపారు. అయితే, సమాజ సేవ చేసే వేదికల్లో చేరుతారని వివరించారు. ఆ వేదిక రాజకీయానికి చెందినదైనా, మరేదైనా, సమాజానికి సేవ చేసేదైతే అందులో చేరుతారని తెలిపారు. అందులో తనను స్వతంత్రంగా సేవ చేయనిస్తే చాలని అన్నారు. తన కాళ్లను కిందికి లాగే వాళ్లు లేకుంటే చాలని చెప్పారు. 

మాల్వికా సూద్ ఏ పార్టీలో చేరుతున్నారనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. పార్టీ ముఖ్య విషయం కాదని, కానీ, ఆమె పాలసీ ముఖ్యమని వివరించారు. తన సోదరి సమాజానికి సేవ చేస్తుందని తెలిపారు. ప్రజలు తన సోదరికి మద్దతు ఇవ్వాలని చెప్పారు. అదే తరుణంలో ప్రస్తుత రాజకీయ పార్టీల్లో ఆప్, కాంగ్రెస్ రెండూ మంచి పార్టీలని అన్నారు. సోనూసూద్ గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు దేశ్ కే మెంటర్ అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి అంగీకరించారు. ఇటీవలే ఆయన పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో సమావేశమయ్యారు. త్వరలోనే సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌నూ కలువనున్నట్టు వివరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios