పూణె:  మహారాష్ట్రలోని పూణెలో ఓ స్కూల్  యాజమాన్యం  విద్యార్ధినులు దరించే లో దుస్తులు, వాష్ రూమ్‌కు వెళ్లే  సమయంపై ఆంక్షలు విధించింది. దీంతో విద్యార్ధినుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం తీరును తప్పుబట్టారు.

. మహారాష్ట్రలోని పుణెలోని మయీర్‌ ఎమ్‌ఐటీ స్కూల్‌ విధించిన ఆంక్షలు వివాదాస్పదమయ్యాయి. విద్యార్థినులు ధరించే స్కర్టుల పొడవు ఎతుందో ఖచ్చితంగా పేర్కొనాలని స్కూల్‌ యాజమాన్యం ఆదేశించింది.

విద్యార్థినులు తెలుపు లేదా స్కిన్‌ కలర్‌ లోదుస్తులు ధరించాలని స్కూల్ యాజమాన్యం ఆదేశించింది. అంతేకాదు విద్యార్ధినులు ధరించిన స్కర్ట్‌ పొడవు ఎంతుందో ఖచ్చితంగా పేర్కొంటూ స్కూల్‌ డైరీలో రాయాలని ఆదేశించింది. అంతేకాదు ఈ డైరీలో తమతో సంతకం పెట్టించుకుని తీసురావాలని స్కూల్‌ యాజమాన్యం ఆదేశించినట్టు విద్యార్ధుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

తమ ఆదేశాలు పాటించని విద్యార్థులు, తల్లిదండ్రులపై చర్యలు తప్పవని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆంక్షలపై మండిపడుతున్నారు. స్కూల్ యాజమాన్యం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో తమకు  ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొనే  ఈ రకమైన నిబంధనలను విధించినట్టుగా  ఎమ్‌ఐటీ సంస్థల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుచిత్ర కరాద్‌ నగరె తెలిపారు.దీని వెనుక ఎటువంటి రహస్య అజెండా లేదన్నారు.