పరుగుల రాణి, ఎంపీ పీటీ ఉష‌ జీవితంలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఆమె రాజ్య‌స‌భ చైర్మ‌న్ చైర్‌లో కూర్చుని స‌భా వ్య‌వ‌హారాల‌ను న‌డిపించారు. 

రాజ్య‌స‌భ‌లో గురువారం నాడు ఓ అరుదైన ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. పరుగుల రాణి, ఎంపీ పీటీ ఉష‌ .. రాజ్య‌స‌భ చైర్మ‌న్ చైర్‌లో కూర్చుని స‌భా వ్య‌వ‌హారాల‌ను న‌డిపించారు. రాజ్యసభలో ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ గైర్హాజరు కావడంతో ప్రముఖ క్రీడాకారిణి పిలావుల్లకండి టెక్కెపరంబిల్‌ ఉష సభకు అధ్యక్షత వహించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ను PT ఉష తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్టు చేసింది. స‌భా కార్యక్ర‌మాల‌ను చూడ‌డం గ‌ర్వంగా ఉంద‌ని, మ‌రిన్ని మైలురాళ్లను అందుకోనున్న‌ట్లు ఆమె పేర్కోంది. PT ఉష జూలై 2022లో భారతీయ జనతా పార్టీ తరుఫున ఎగువ సభకు నామినేట్ చేయబడ్డారు. అలాగే.. నవంబర్‌లో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

PT ఉష తన ట్వీట్‌లో .. "గొప్ప శక్తితో గొప్ప బాధ్యత వస్తుందని ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ చెప్పినట్లు, రాజ్యసభ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నప్పుడు నేను ఈ విషయాన్ని గ్రహించాను. ప్రజలు నాపై ఉంచిన బాధ్యత, నమ్మకంతో నా ప్రయాణం చేయగలనని ఆశిస్తున్నాను. " అని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

అథ్లెట్ పీటీ ఉష .. తన వీడియోను పోస్ట్ చేసిన వెంటనే, ఆమె మద్దతుదారులు, అనుచరులు ఆమెను అభినందించడం ప్రారంభించారు. ప్రశంసలతో ముంచెత్తారు. ఓ నెటిజన్ ఇలా వ్రాశారు. "ఉషా, మీ గురించి చాలా గర్వంగా ఉంది. మీరు భవిష్యత్తులో మరింత ముందుకు సాగాలి. మరోసారి చరిత్రను సృష్టించండి అని కామెంట్ చేశారు. మరో నెటిజన్ "చాలా గర్వంగా ఉంది, మీరు భారతదేశపు ఆడ పిల్లలకు స్ఫూర్తి" అని అన్నారు.

పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ధి చెందిన PT ఉష.. ఇండియా త‌ర‌పున ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పారు. ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లు, ప్రపంచ జూనియర్ ఇన్విటేషనల్ మీట్‌తో సహా పలు అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లలో భారతదేశానికి అనేక పతకాలను గెలుచుకుంది.

ఆమె తన కెరీర్‌లో అనేక జాతీయ, ఆసియా రికార్డులను సృష్టించారు. కొన్నిసార్లు పలు రికార్డులను బద్దలు కొట్టారు. ఈ స్టార్ స్ప్రింటర్ ఆసియా క్రీడల్లో నాలుగు బంగారు పతకాలు, ఏడు రజత పతకాలు సాధించాడు. లాస్ ఏంజిల్స్ 1984 ఒలింపిక్స్‌లో మహిళల 400 మీటర్ల పరుగులో సెకను కంటే తక్కువ తేడాతో ఆమె పోడియం ముగింపుని కోల్పోయింది. లాస్ ఏంజెల్స్‌లో ఆమె ఈ ఫిట్ ను 55.42 సెకన్ల లో పూర్తి చేసింది. ఇప్పటికీ అదే జాతీయ రికార్డుగా ఉంది.