భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) మరో విజయం సాధించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ 44ను గురువారం అర్ధరాత్రి 11.37 గంటలకు ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.

తమిళనాడుకు చెందిన హైస్కూల్ విద్యార్థులు రూపొందించిన కలాంశాట్‌తో పాటు భారత రక్షణ అవసరాల దృష్ట్యా మైక్రోశాట్-ఆర్ అనే రెండు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ నింగిలోకి మోసుకెళ్లింది. బుధవారం రాత్రి 7.37 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 28 గంటల పాటు కొనసాగింది. ప్రయోగం తర్వాత రెండు ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ శివన్ శాస్త్రవేత్తలను అభినందించారు.