వేగంగా, ఖచ్చితమైన వార్తలను అందించడం మీడియా సంస్థలకు ఒక సవాల్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మీడియా సంస్థలు విలువలకు కట్టుబడి పని చేయాలని కోరారు. 

పోటీ భయంతో విలువలతో రాజీ పడకుండా వృత్తి నైపుణ్యం, నైతికతను కాపాడుకోవడానికి మీడియా సంస్థలు కష్టపడి పనిచేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం కోరారు. దేశ రాజధానిలో బుధ‌వారం నిర్వ‌హించిన ఆసియా-పసిఫిక్ ఇనిస్టిట్యూట్ ఫర్ బ్రాడ్‌కాస్టింగ్ డెవలప్‌మెంట్ 20వ సమావేశానికి ఆయ‌న హాజ‌రై మాట్లాడారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ విడుదల.. రాహుల్ గాంధీ బరిలో లేనట్టేనా..?

“నిజమైన జర్నలిజం అంటే వాస్తవాలను ఎదుర్కోవడం, సత్యాన్ని ప్రదర్శించడం. అన్ని పక్షాలు తమ అభిప్రాయాలను ప్రదర్శించడానికి ఒక వేదికను అందించ‌డం. పోలరైజింగ్‌గా ఉన్న తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తే, గ‌ట్టిగా అరిచే అతిథులను ఆహ్వానించాలని మీరు నిర్ణయించుకుంటే మీ ఛానెల్ విశ్వసనీయత తగ్గుతుంది. అతిథి, ఆయ‌న స్వ‌రం, మీరు చూపించే విజువ‌ల్స్ అన్ని ప్రేక్ష‌కుల్లో మీ విశ్వసనీయతను నిర్ణ‌యిస్తాయి.” అని మంత్రి అన్నారు.

ప్రియుడి కోసం భర్త హత్య.. సీరియల్ స్టైల్లో పక్కా స్కెచ్.. కానీ..

వార్తా ఛానళ్లలో చర్చలు, కొన్ని సందర్భాల్లో తీవ్ర వాగ్వివాదాలుగా మారడాన్ని ఠాకూర్ ప్రస్తావిస్తూ.. మీడియా నైతికత, విలువలను కాపాడుతూ సత్యమైన ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను వేగంగా అందించడం మీడియా సంస్థలకు గొప్ప సవాలు అని అన్నారు.

వీక్షకుడు మీ ప్రదర్శనను చూడటానికి ఒక నిమిషం పాటు ఆగవచ్చు కానీ మీ యాంకర్‌ను, మీ ఛానెల్ లేదా బ్రాండ్‌ను విశ్వసనీయమైన మరియు పారదర్శకమైన వార్తల మూలంగా ఎప్పటికీ విశ్వసించరని ఠాకూర్ తెలిపారు. “ఈ విపరీతమైన పోటీలో మన విలువలతో రాజీపడే బదులు, వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకోవడానికి మనం కష్టపడి పనిచేయాలి. తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారితో పోటీ పడాలనే ప్రలోభాలకు లోనుకాకుండా, కట్టుకథలు లేకుండా వార్తలను నివేదించడం పాత్రికేయుల బాధ్యత అని నేను గట్టిగా నమ్ముతున్నాను” అని ఠాకూర్ అన్నారు.

సరదాగా తిరునాళ్లకు వెడితే... మైనర్ ను వివస్త్రను చేసి గ్యాంగ్ రేప్..నగ్నంగా గ్రామానికి వస్తుండగా వీడియో తీసి..

‘‘ ఈ తీవ్రమైన పోటీలో మన విలువలతో రాజీపడే బదులు, వృత్తినైపుణ్యాన్ని కాపాడటానికి మనం కష్టపడి పనిచేయాలి. తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారితో పోటీ పడాలనే ప్రలోభాలు ఉన్నప్పటికీ, అవాస్తవాలు లేకుండా వార్తలను నివేదించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని నేను బలంగా నమ్ముతున్నాను ’’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.