నరేంద్రమోడీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చెన్నైలో కొందరు ఆందోళనకారులు ముగ్గులు వేసి తమ నిరసనను తెలియజేశారు.

దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నందునే వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Also Read:ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, 65 ఏళ్లకు పెళ్లి

అయితే చెన్నై పోలీసులు నిరసన తెలియజేసేందుకు తమకు ఎలాంటి అనుమతి ఇవ్వకపోవడం వల్లే రోడ్లపైనా, ఇంటి ముందు ముగ్గులు వేసి సీఏఏ బిల్లుపై నిరసన తెలియజేసినట్లు ఒకరు తెలిపారు.

Also Read:సీఏఏ ఆందోళనలు... నష్ట పరిహారంగా రూ.6లక్షలు

కాగా నిరసనకారులను విడిపించేందుకు వచ్చిన ఇద్దరు న్యాయవాదులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకోవడం కొసమెరుపు. దీనిపై నటి రిచా చద్దా మాట్లాడుతూ.. ముగ్గులు వేయడం కూడా జాతి వ్యతిరేకమా అంటూ ఆమె ట్వీట్ చేశారు.