కర్ణాటకలో ప్రకాశ్ రాజ్‌కు నిరసన సెగ.. ‘ఈ నగరంలోకి రావడానికి వీల్లేదు’
కర్ణాటకలో ప్రకాశ్ రాజ్‌కు మరోసారి నిరసన సెగ ఎదురైంది. కాలబుర్గిలో నల్ల చొక్కాలు ధరించి ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. కాలబుర్గిలోకి రావడానికి వీల్లేదని డిమాండ్ చేస్తున్నారు.

బెంగళూరు: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌కు కర్ణాటకలో మరోసారి నిరసన సెగ తాకింది. ఇటీవల కాలంలో సనాతన ధర్మంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ సందర్బంలోనూ ప్రకాశ్ రాజ్ పై వ్యతిరేకత పెరిగింది. ప్రస్తుతం కర్ణాటకలోని కలబుర్గిలో ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నల్ల రంగు చొక్కాలు ధరించి ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని శాంతి భద్రతలను కాపాడారు.
అంతకు ముందు హిందూ సంఘాల సభ్యులు ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా కాలబుర్గి కలెక్టర్‌కు ఓ మెమోరాండం సమర్పించారు. ప్రకాశ్ రాజ్‌ను వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా వివరిస్తూ ఆ మెమోరాండం అందించారు. అంతేకాదు, వారు కాలబుర్గిలో ప్రవేశించడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ కాలబుర్గిలోకి ప్రవేశించడానికి వీల్లేదని డిమాండ్ చేశారు.
Also Read: ఇప్పుడే పిల్లలు వద్దని పుట్టినింటికి వెళ్లిన భార్య.. భర్త ఆత్మహత్య.. కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే?
ప్రకాశ్ రాజ్ కాలబుర్గికి రావాల్సిన ఉన్న తరుణంలో ఈ నిరసనలు జరగడం గమనార్హం. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడాల్సి ఉన్నది. ఈ కార్యక్రమం సందర్భంగా హిందూ సంఘాలు ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి.