ప్రభుత్వాధికారుల కన్నా వేశ్యలు బెటర్: బిజెపి ఎమ్మెల్యే

Prostitutes are better than government officials: BJP MLA
Highlights

బిజెపి శాసనసభ్యుడు సురేంద్ర సింగ్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

న్యూఢిల్లీ: బిజెపి శాసనసభ్యుడు సురేంద్ర సింగ్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ప్రభుత్వాధికారుల కన్నా వేశ్యలు ఉత్తమమని అన్నారు. లంచాలు అడిగితే అధికారులను తన్ని తగిలేయాలని వ్యాఖ్యానించిన మర్నాడే ఆ వ్యాఖ్య చేశారు. 

"వేశ్యలు ప్రభుత్వాధికారుల కన్నా ఉత్తమం. కనీసం వాళ్లు డబ్బులు తీసుకుని వారి పనులు వారు చేస్తారు, వేదికపై నృత్యం చేస్తారు. కానీ ఈ అధికారులు డబ్బులు తీసుకుని కూడా పని చేయరు. పని అవుతుందనే గ్యారంటీ లేదు" అని అన్నారు.

ఓ బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యాలు చేశారు. అతను పనిచేయడానికి అంగీకరించకపోతే కొట్టి గుణపాఠం నేర్పాలని, అప్పటి కూడా చేయకపోతే బూట్లతో కొట్టాలని అన్నారు. 

loader