నమీబియా నుంచి ఇండియాకు తీసుకువచ్చిన ఎనిమిది చిరుతలను ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17వ తేదీన మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో విడుదల చేశారు. అయితే అప్పటి నుంచి క్వారంటైన్ లో ఉన్న చిరుతలను పెద్ద ఎన్ క్లోజర్ లోకి విడుదల చేసే ప్రక్రియ ప్రారంభమైంది.
ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చిన ఎనిమిది చిరుతల్లో రెండు మగ చిరుతలను పెద్ద ఎన్‌క్లోజర్‌లలోకి వదిలారు. ఇప్పుడు అవి కొంత ఎక్కువ విస్తీర్ణంలో బహిరంగంగా వేటాడవచ్చు. మిగిలిన ఆరు చిరుతలను కూడా దశల వారీగా విడుదల చేయనున్నారు.
గుజరాత్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్.. పార్టీని వీడిన మాజీ మంత్రి జయనారాయణ వ్యాస్..
ప్రాజెక్టు చీతా టాస్క్‌ఫోర్స్‌లోని నలుగురు సభ్యులు శనివారం కునో నేషనల్ పార్క్‌లో చిరుతల కోసం ఏర్పాటు చేసిన పెద్ద ఎన్‌క్లోజర్‌లను పరిశీలించారు. ఈ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అందులోకి చిరుతలను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో వాటిని శనివారం విడుదల చేశారు. సెప్టెంబర్ నెలలో నుంచి వాటిని ఉంచిన క్వారంటైన్ ప్రాంతంలో అవి అలవాటు పడ్డాయని, వాటిని పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి పంపించామని కునో నేషనల్ పార్క్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రకాష్ కుమార్ వర్మ ‘పీటీఐ’తో తెలిపారు.
‘‘ దిగ్బంధం జోన్ల నుండి పెద్ద ఎన్‌క్లోజర్‌లో శనివారం రెండు చిరుతలను విడిచిపెట్టారు. మిగిలిన ఆరు చిరుతలను కూడా దశలవారీగా (అక్లిమటైజేషన్ ఎన్‌క్లోజర్) లో విడుదల చేస్తాం’’అని డీఎఫ్ వో ప్రకాష్ కుమార్ వర్మ పేర్కొన్నారు. ఈ పెద్ద ఎన్‌క్లోజర్ ఐదు చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుందని చెప్పారు.
ఘోరం.. చేతబడి చేసిందనే నెపంతో 45 ఏళ్ల మహిళ సజీవ దహనం
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ కునో నేషనల్ పార్క్‌లో నిర్మించిన 1500 చదరపు మీటర్ల చిన్న ఎన్‌క్లోజర్‌లో 30-66 నెలల వయస్సున్న ఐదు ఆడ, మూడు మగ చిరుతలను వదిలారు. అప్పటి నుంచి వాటిని క్వారంటైన్‌లో ఉంచి మాంసాన్ని అందించారు. దాదాపు ఒకటిన్నర నెలల తర్వాత ఇప్పుడు వాటిని పెద్ద ఎన్‌క్లోజర్‌లో విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించారు.
అంతర్జాతీయ నిబంధనల ప్రకారం.. వన్యప్రాణులను వేరే దేశానికి తరలించే ముందు లేకపోతే తరలించిన తరువాత అయిన సంక్రమణ వ్యాప్తిని తనిఖీ చేయడానికి ఒక నెల పాటు నిర్బంధంలో ఉంచాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇక్కడికి తీసుకొచ్చిన తరువాత ఫ్రెడ్డీ, ఆల్టన్, సవన్నా, సాషా, ఒబాన్, ఆషా, సిబిలి సైసా అనే చిరుతలను ఒక నెలపాటు నిర్బంధంలో ఉంచారు. ఈ ఎనిమిది చిరుతను ఆరు 'బోమాస్' (ఎన్‌క్లోజర్‌లు)లో ఉంచి పర్యవేక్షించారు. ఆ సమయంలో వాటికి గేదె మాంసం అందించారు.
దారుణం.. టీచర్ విధించిన పనిష్మెంట్ తట్టుకోలేక నాలుగో తరగతి బాలిక మృతి.. ఎక్కడంటే ?
భారతదేశంలో చివరి చిరుత ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో 1947లో మరణించింది. 1952లో ఈ జాతి అంతరించిపోయినట్లు ప్రకటించారు. కాగా ప్రస్తుతం ఎన్‌టీసీఏ ఏడీజీ ఎస్పీ యాదవ్ ఆధ్వర్యంలో ఈ చిరుతలను ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు.
