Asianet News TeluguAsianet News Telugu

జామియా మసీదు ప్రాంగణంలో పురుషులు, మహిళలు కలిసి కూర్చోవడం నిషేధం - నోటిఫికేషన్ జారీ చేసిన యాజమాన్యం

జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో ఉన్న జామియా మసీదు యాజమాన్యం కొత్త నిబంధలను తీసుకొచ్చింది. మసీదు ప్రాంగణంలో పురుషులు, మహిళలు కలిసి కూర్చోకూడదని, లోపలికి ఫొటో, వీడియో కెమెరాలు తీసుకెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. 

Prohibition of men and women sitting together in Jamia Masjid premises - Management issued notification
Author
First Published Dec 17, 2022, 12:52 PM IST

శ్రీనగర్‌లో చారిత్రాత్మక జామియా మసీదు ప్రాంగణంలో ఉన్న పచ్చిక బయళ్లలో పురుషులు, మహిళలు కలిసి కూర్చోవడానికి వీల్లేదని ఆ మసీదు యాజమాన్యం తొలిసారిగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే ఈ మసీదు లోపల ఇక ఫొటోగ్రాఫర్ లు, కెమెరామెన్‌లు ఎలాంటి ఫొటోలూ తీయకూడదని తేల్చి చెప్పింది.

వీసా పేరుతో మోసం.. ఇద్దరు ఫ్రెంచ్ ఎంబసీ ఉద్యోగులతో సహా ఆరుగురి అరెస్టు..

ఈ విషయంపై అధికారులు మాట్లాడుతూ..  “ఫోటోగ్రాఫర్‌లు, కెమెరామెన్‌లు ఇక నుంచి మసీదు లోపల ఎలాంటి ఫొటోలు, వీడియోలు తీయడానికి అనుమతి లేదు. అలాగే ఫొటోలు, వీడియోలు తీసే పరికరాలను కూడా లోపలికి నిషేధించాం. వాటిని గేట్ వద్దనే నిలిపివేయాలి. వీటితో పాటు మసీదు లోపల ఆహారాన్ని అనుమతించం.’’ అని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

2024 నాటికి అమెరికా తరహా రహదారులు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

“మసీదు ప్రార్ధనా స్థలం. కాబట్టి సందర్శకులు మసీదు పవిత్రతను గౌరవించాలి. మసీదును సందర్శించేటప్పుడు అందరూ నిబంధనలు పాటించాలి. ఇది పబ్లిక్ పార్క్, ఎంటర్ టైన్ మెంట్ కాదు. ’’ అని నోటిఫికేషన్ పేర్కొంది. ‘‘ఆరాధకులు పురుషులు, మహిళలు ఇద్దరూ మసీదులో ప్రార్థన చేసేటప్పుడు వారి నిర్దిష్ట స్థలాలను ఉపయోగించాలి.’’ అని నోటిఫికేషన్ లో యాజమాన్యం తెలిపింది. తాజాగా విధించిన నిబంధలను వెంటనే అమలు చేయాలని భద్రతా సిబ్బందిని యాజమాన్యం ఆదేశించింది.

14వ శతాబ్దానికి చెందిన ఈ మసీదులో పురుషులు, మహిళలతో పాటు వందలాది మంది ప్రజలు ప్రతీ రోజూ ప్రార్థనలు చేయడానికి వస్తుంటారు. మసీదులో పురుషులకు వేరుగా ఉండే ప్రత్యేక స్థలం ఉన్నందున మహిళలకు కూడా ఇక్కడికి ప్రవేశం ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న ఈ జామియా మసీదు కాశ్మీర్‌లోనే అతిపెద్ద మసీదు. ఇది శ్రీనగర్‌లోని పురాతన మసీదులలో ఒకటి. దీనిని క్రీస్తు శకం 1400లో నిర్మించారు. ఈ మసీదులో ఒకే సారి ముప్పై వేల మంది కలిసి నమాజ్ చేయవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios