Asianet News TeluguAsianet News Telugu

వీసా పేరుతో మోసం.. ఇద్దరు ఫ్రెంచ్ ఎంబసీ ఉద్యోగులతో సహా ఆరుగురి అరెస్టు..

వీసా మోసం ఆరోపణలపై న్యూఢిల్లీలోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయంలోని ఇద్దరు మాజీ ఉద్యోగులతో సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అలాగే.. ఢిల్లీ, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌లోని ఆరు చోట్ల సీబీఐ శుక్రవారం దాడులు చేసింది. ఎంబసీ వీసా విభాగానికి చెందిన మాజీ ఉద్యోగులు శుభమ్ షోకీన్, ఆర్తి మండల్‌లు జనవరి-మే మధ్య కాలంలో ఇతరులతో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారని ఏజెన్సీ ఆరోపించింది.

Six Arrested Including Two Employees Of The French Embassy In Visa Fraud
Author
First Published Dec 17, 2022, 12:20 PM IST

వీసా మోసం ఆరోపణలపై న్యూఢిల్లీలోని ఫ్రెంచ్ ఎంబసీ వీసా విభాగానికి చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగులతో సహా ఆరుగురిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శుక్రవారం అరెస్టు చేసింది. అలాగే.. ఢిల్లీ, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌లోని ఆరు చోట్ల సీబీఐ శుక్రవారం దాడులు చేసింది. ఎంబసీ వీసా విభాగానికి చెందిన మాజీ ఉద్యోగులు శుభమ్ షోకీన్, ఆర్తి మండల్‌లు ఇతరులతో కలిసి జనవరి-మే మధ్య కాలంలో  ఈ మోసానికి పాల్పడ్డారని ఏజెన్సీ ఆరోపించింది. 

శుభమ్ షోకీన్, ఆర్తి మండల్, నవజోత్ సింగ్, చేతన్ శర్మ, సత్వీందర్ సింగ్ పురేవాల్, మన్‌ప్రీత్ సింగ్ గా ముఠాగా ఏర్పాడ్డరనీ, నిరుద్యోగులను, యువతను టార్గెట్ చేసుకుని ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 6 వరకు వీసా మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఐదు నెలల్లో పలు నకిలీ పత్రాల రూపొందించి.. పంజాబ్, జమ్మూ చెందిన  చాలా మంది దరఖాస్తుదారులకు ఫ్రెంచ్ వీసాలు జారీ చేస్తామని నమ్మించి మోసం చేశారని తెలిపారు.  

ఒక్కో వీసాకు రూ.50 వేలు  

ఎంబసీ సిబ్బంది శుభమ్‌, ఆర్తి మరో ముగ్గురు నిందితులు ఒక్కో వీసాకు రూ.50 వేలు చొప్పున లంచం తీసుకుంటూ ఫ్రాన్స్‌కు చెందిన ఎంట్రీ వీసాలు మంజూరు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎంబసీ వీసా విభాగం అధిపతి అనుమతి లేకుండానే వీసాలు జారీ చేశారు. ఆ తర్వాత సాక్ష్యాలను కూడా ధ్వంసం చేశారు. ఈ మూడు కేసుల్లోనూ బెంగుళూరుకు చెందిన ఓ కంపెనీ ఫ్రెంచ్ కంపెనీల్లో పని చేస్తున్నట్టు పేర్కొంటూ ఫ్రెంచ్ కాన్సులేట్‌కు లేఖ ఇచ్చారు. లేఖతో పాటు నకిలీ పత్రాలు సమర్పించారు.

ఆరు చోట్ల సోదాలు.. 

వీసా మోసం కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత.. ఢిల్లీ,పాటియాలా, గురుదాస్‌పూర్, జమ్మూలో  ఆరు చోట్ల సీబీఐ దాడులు చేసింది. ఈ దాడుల్లో పలు మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌లను కూడా సీబీఐ స్వాధీనం చేసుకుంది. దీనితో పాటు.. వారి దాచిన ప్రదేశాల నుండి చాలా అనుమానాస్పద పాస్‌పోర్ట్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో దర్యాప్తు జరుగుతోంది. 

సీబీఐ ప్రతినిధి మాట్లాడుతూ.. “పంజాబ్, జమ్మూకి చెందిన దరఖాస్తుదారులకు బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ పేరుతో నకిలీ పత్రాలను తయారు చేసి..  బెంగళూరులోని ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్‌కు సమర్పించారని ఆరోపించారు. ఫ్రాన్స్‌కు వెళ్లడానికి.. పోర్ట్-లే-హార్వేలో ఉపాధి కోసం ప్రవేశ వీసాలు జారీ చేయడానికి. ఒక్కో వీసా కోసం రూ.50,000 లంచం తీసుకుని ఇక్కడి ఫ్రెంచ్ ఎంబసీలోని వీసా విభాగం అధిపతికి తెలియకుండా, అనుమతి లేకుండా షోకీన్, మండల్ మరో ముగ్గురు నిందితులకు వీసాలు జారీ చేశారని ఏజెన్సీ ఆరోపించింది.

Follow Us:
Download App:
  • android
  • ios