దర్బంగా పేలుడు కేసులో ఎన్ఐఏ గురువారంనాడు పట్నా ప్రత్యేక కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసింది. ఐదుగురిపై ఎన్ఐఏ అభియోగాలను మోపింది. ఈ ఏడాది జూన్ 17న దర్బంగా రైల్వే స్టేషన్ లో ఈ పేలుడు చోటు చేసుకొంది. సికింద్రాబాద్ నుండి పంపిన బట్టల పార్శిల్ లో నిందితులు పేలుడు పదార్ధాలు పంపారు.

హైదరాబాద్: దర్బంగా పేలుడు కేసులో ఎన్ఐఏ చార్జీషీట్ ను దాఖలు చేసింది. ఈ కేసులో ఐదుగురిపై ఎన్ఐఏ అభియోగాలు మోపింది. మహమ్మద్ నసీర్ ఖాన్, ఇమ్రాన్ మాలిక్, సలీం అహ్మద్, కపిల్ అహ్మద్, ఇక్బాల్ అహ్మద్ లను ఈ కేసులో నిందితులుగా తేల్చింది ఎన్ఐఏ. ఈ మేరకు చార్జీషీట్ ను పట్నాలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో చార్జీషీట్ ను దాఖలు చేసింది.

 పాకిస్తాన్ కు చెందిన లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థ ఆదేశాల మేరకు ఈ ఏడాది జూన్ 17న Darbhanga రైల్వే స్టేషన్ పేలుడుకు నిందితులు పాల్పడినట్టుగా Nia ఆ చార్జీషీట్ లో పేర్కొంది. నడుస్తున్న రైలులో పేలుడు పదార్ధాలతో పేల్చివేయడంతో భారీ నష్టం వాటిల్లేలా ప్లాన్ చేశారు. అయితే పేలుడు చోటు చేసుకొన్న సమయంలో రైలు దర్బంగా రైల్వే స్టేషన్ లో ఆగింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఎన్ఐఏ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

#also read:ఒక్కో బ్లాస్ట్‌కి రూ. కోటి నజరానా: దర్బాంగా బ్లాస్ట్‌లో సంచలన విషయాలు

Charge sheet లో పేర్కొన్న ఐదుగురిలో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే ఇక్బాల్ మహ్మద్ మాత్రం పరారీలో ఉన్నారు. పాకిస్తాన్ లోని లాహోర్ లో ఆయన ఉంటున్నాడని ఎన్ఐఏ ప్రకటించింది. మిగిలిన నలుగురు నిందితులు Uttar pradesh రాష్ట్రంలోని షామ్లీకి చెందినవారని ఎన్ఐఏ తెలిపింది.ఐపీసీ సెక్షన్ ‌లోని పేలుడు పదార్ధాల చట్టం, యూఏపీఏలోని సెక్షన్ల కింద ఈ చార్జీషీట్ దాఖలు చేసినట్టుగా ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

 హఫీజ్ ఇక్బాల్ ఆదేశాల మేరకు పాకిస్తాన్ కు చెందిన లష్కరేతోయిబా కార్యకర్త మహ్మద్ నాసిర్ ఖాన్ , ఇమ్రాన్ మాలిక్ స్థానికంగా సేకరించిన రసాయనాలను ఉపయోగించి ఏల్‌ఈడీని తయారు చేసి దాన్ని బట్టల పార్శిల్ లో ఉంచినట్టుగా ఎన్ఐఏ అధికారులు చార్జీషీట్ లో వివరించారు.

Secundrabad-దర్భంగా ఎక్స్‌ప్రెస్ లో పార్శిల్ న బుక్ చేశారు. బట్టల పార్శిల్ లో ఉన్న ఎల్ఈడీ పేలుడు సంభవించిన సమయంలో బట్టలు కూడ మంటల్లో దగ్ధమై నడుస్తున్న రైళ్లలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించే అవకాశం ఉందని నిందితులు ప్లాన్ చేశారని ఎన్ఐఏ ఆ చార్జీషీట్ లో తెలిపింది. మహ్మద్ నాసిర్ ఖాన్ Pakistan కు వెళ్లి పలు విషయాల్లో శిక్షణ పొందాడు, పేలుడు పదార్ధాలను కూడా తయారు చేయడంలో శిక్షణ పొందాడని ఎన్ఐఏ ఆ చార్జీషీట్ లో పేర్కొంది.

ఈ పేలుడు జరిగిన తర్వాత నిందితులు విదేశాలకు పారిపోవాలని ప్లాన్ కూడా చేసుకొన్నారని కూడా ఎన్ఐఏ వివరించింది. మహ్మద్ నాసిర్ ఖాన్, ఇమ్రాన్ మాలిక్, సలీమ్ అహ్మద్, కఫిల్ అహ్మద్ నేపాల్ ద్వారా విదేశాలకు పారిపోయేందుు ప్రయత్నించారని ఎన్ఐఏ పేర్కొంది.

హైద్రాబాద్ కేంద్రంగా దర్బంగా పేలుడుకు ప్లాన్

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిందితుడు నసీర్ ఖాన్ పలుమార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత Hyderabad కు వచ్చాడు. తన సోదరుడు ఇమ్రాన్ మాలిక్ తో కలిసి హైద్రాబాద్ లోని హబీబ్ నగర్ లో బట్టల వ్యాపారం ప్రారంభించాడు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఇద్దరు సోదరులు బట్టల పార్శిల్ లో పేలుడు పదార్ధాలను పెట్టి పంపారు.