విచారణ జరపడం దర్యాప్తు సంస్థల పని: విపక్షలకు లోక్‌సభలో మోడీ కౌంటర్

కాంగ్రెస్ తీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు.  రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై  మోడీ సమాధానమిచ్చారు.

Probe agencies are independent, Constitution has kept them so:  PM Modi in Lok Sabha lns


న్యూఢిల్లీ:విచారణ జరపడం దర్యాప్తు సంస్థల పని అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఈడీ దాడులపై  విపక్షాల విమర్శలపై ఆయన కౌంటరిచ్చారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు  సోమవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  లోక్ సభలో సమాధానమిచ్చారు. దర్యాప్తు సంస్థలు స్వంతంత్రంగా ఉంటాయన్నారు.రాజ్యాంగంలో వాటికి అదే స్థానం ఉందన్నారు.

అవినీతిని అంతం చేసే వరకు విశ్రమించబోనని మోడీ పేర్కొన్నారు.కాంగ్రెస్ హయంలో ఈడీ కేవలం రూ. 5 వేల కోట్లు సీజ్ చేసిందని ఆయన గుర్తు చేశారు. కానీ పదేళ్లలో తమ ప్రభుత్వం లక్షల కోట్లను సీజ్ చేసిందన్నారు.ఖాదీని, చేనేతను దేశ ప్రజలకు కాంగ్రెస్ దూరం చేసిందన్నారు.  కాంగ్రెస్ ఒకే ప్రొడక్టును మాటిమాటికి లాంచ్ చేస్తుందని ఆయన విమర్శించారు. వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టమన్నారు.

also read:ఇండియా కూటమి అలైన్‌మెంట్ దెబ్బతింది: లోక్‌సభలో కాంగ్రెస్ పై మోడీ సెటైర్లు

నేతల పిల్లలు రాజకీయాల్లో రావడం తప్పు కాదన్నారు.కానీ, వాళ్లే పార్టీని చేతుల్లోకి తీసుకువడం మంచిది కాదన్నారు. మౌలిక వసతులకు కాంగ్రెస్ హయంలో రూ. 11 లక్షల కోట్లు మాత్రమే  ఖర్చు చేశారన్నారు.పదేళ్లలో  రూ. 44 లక్షల కోట్లు వ్యయం చేసినట్టుగా చెప్పారు.పేదలకు  17 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్టుగా తెలిపారు.అధిక ధరల పాపం కాంగ్రెస్ దేనని మోడీ చెప్పారు.కరోనా వంటి సమయంలో కూడ  ధరలను అదుపు చేసిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు.  దేశ ప్రజలను గాంధీ కుటుంబం చాలా చిన్నచూపు చూసిందన్నారు.50 కోట్ల మంది పేదలతో  బ్యాంకు అకౌంట్లు తెరిపించినట్టుగా తెలిపారు.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios