Asianet News TeluguAsianet News Telugu

ప్రతిపక్షాన్ని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని భావిస్తుంది. బీజేపీ పై ప్రియాంక గాంధీ విమర్శలు

పార్లమెంటు సభ్యత్వం రద్దు తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం మొదటిసారి మీడియా ముందుకు వచ్చి  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై బహిరంగంగా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు.

Priyanka Gandhi   says BJP wants to finish off Opposition, democracy from country KRJ
Author
First Published Mar 26, 2023, 4:38 AM IST

రాహుల్ గాంధీపై అనర్హత వేటు: పార్లమెంటు సభ్యత్వం రద్దు తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం మొదటిసారి మీడియా ముందుకు వచ్చి  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై బహిరంగంగా విరుచుకుపడ్డారు. దీనిపై స్పందించిన బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదిక  శనివారం ట్వీట్ చేస్తూ.. ఈ ప్రశ్నను బిజెపి తప్పించుకోవాలనుకుంటోంది. పార్లమెంటు మొత్తం నిశ్బద్దంగా  ఉంది. ప్రధాని మూగబోయారు. తాజాగా రాహుల్ పై రకరకాల దాడులు జరుగుతున్నాయి. కానీ, గౌతమ్‌ అదానీకి చెందిన షెల్‌ కంపెనీల్లో ఎవరి సొమ్ము ఇన్వెస్ట్‌ చేశారు.. ఎందుకు విచారణ చేయడం లేదు.. దీనికి సమాధానం చెప్పడం లేదు. అని ట్విట్ చేశారు. 

మరో ట్వీట్‌లో ప్రియాంక రాహుల్ గాంధీ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. అందులో ప్రధానమంత్రి కళ్లలో భయం చూశానని, అదానీపై పార్లమెంట్‌లో చేసిన ప్రసంగానికి ఆయన భయపడుతున్నారని రాశారు. షెల్ కంపెనీలు అదానీ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టిన ₹20000 కోట్ల విలువైన విదేశీ డబ్బు ఎవరిది? ఈ ప్రశ్న నుండి దృష్టి మరల్చడానికే ఈ డ్రామా అంతా. ట్విట్ చేశారు. 

ఇంతకు ముందు కూడా ప్రియాంక మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా  ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని బిజెపి కోరుకుంటోంది. అందుకే బీజేపీ  విపక్షాల ప్రజల గొంతుకపై నిరంతరం దాడి చేస్తోంది. బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, మిసా భారతిలను ఏజెన్సీలు వేధిస్తున్నాయి. ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా అందరం ఐక్యంగా ఉద్దాం. అని  ఆమె మరో ట్వీట్‌లో రాసుకోచ్చారు. 

ప్రభుత్వం భయపడుతోంది: రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దయిన తర్వాత రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్-బీజేపీ ముఖాముఖి. ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ అదానీ కేసులో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు. ఎవరైనా నాపై అనర్హత వేటు వేసినా, జైల్లో పెట్టినా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటానని అన్నారు.

వెనుకబడిన వారిని రాహుల్ గాంధీ అవమానించారు: బీజేపీ

మరోవైపు రాహుల్ ప్రకటనను వెనుకబడిన సామాజికవర్గంతో ముడిపెడుతోంది బీజేపీ. రాహుల్‌ ప్రకటన అనంతరం బీజేపీ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాహుల్‌పై 60 పరువు నష్టం కేసులు ఉన్నాయని అన్నారు. వెనుకబడిన సమాజాన్ని అవమానించాడు. ఎందుకు వీళ్లంతా మోడీ దొంగలు అని చెబుతూ? విమర్శ అంటే దుర్వినియోగం కాదు. రాహుల్ గాంధీ 2019లో చేసిన ఒక ప్రసంగానికి శిక్ష అనుభవించారు.

Follow Us:
Download App:
  • android
  • ios