Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గుడ్ బై

కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ప్రియాంక చతుర్వేది ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనకు పార్టీలో తగిన విలువ ఇవ్వడం లేదంటూ... ఆవేదన వ్యక్తం చేసిన ఆమె..చిరకు పార్టీకి రాజీనామా చేశారు.
 

Priyanka Chaturvedi quits Congress after party brings back leaders who misbehaved with her
Author
Hyderabad, First Published Apr 19, 2019, 12:23 PM IST

కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ప్రియాంక చతుర్వేది ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనకు పార్టీలో తగిన విలువ ఇవ్వడం లేదంటూ... ఆవేదన వ్యక్తం చేసిన ఆమె..చిరకు పార్టీకి రాజీనామా చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఇటీవల ప్రియాంక చతుర్వేది..  ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె పట్ల కొందరు కాంగ్రెస్ నేతలు అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై ఆమె వెంటనే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో ప్రియాంకతో తప్పుగా ప్రవర్తించిన వారిని సస్పెండ్ చేశారు.

అయితే.. అలా సస్పెండ్ చేసిన వారిని జ్యోతిరాదిత్య సింథియా జోక్యంతో తిరిగి మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. ఈ విషయం ఆమెను కలచివేసింది.తన పట్ల తప్పుగా ప్రవర్తించిన వారిని మళ్లీ పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఆమె మండిపడింది. ఈ క్రమంలో తన ఆవేదనను ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

‘ఎంతోమంది త్యాగాలతో రూపుదిద్దుకున్న పార్టీలో కొంత మంది గూండాలకు ఇంకా ప్రాధాన్యం దక్కుతోంది. అభ్యంతరకరంగా మాట్లాడి, నన్ను బెదిరించిన వాళ్లకు కనీస శిక్ష పడకపోవడం చాలా బాధిస్తోంది. నిజంగా ఇది విచారకరం’ అని ట్వీట్‌ చేశారు. అదే విధంగా ప్రియాంక చతుర్వేదితో అసభ్యంగా ప్రవర్తించిన నాయకులను పార్టీలో పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ విడుదల చేసిన లేఖ అంటూ ఓ జర్నలిస్టు షేర్‌ చేసిన ఫొటోను తన ట్వీట్‌కు జతచేశారు.

ట్విట్టర్ లో తన  ఆవేదనను ఆమె వెల్లబుచ్చినా... కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందించలేదు. దీంతో.. తీవ్ర ఆవేదనకు గురైన ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios