తిహార్ జైలు ముుందు ఖైదీలు క్యూ కట్టారు. లోపటికి వెళ్లడానికి సిద్ధమై వచ్చారు. అక్కడి వరకు వెంట వచ్చిన ఆప్తులకు వీడ్కోలు చెబుతూ ఒక్కొక్కరు తిహార్ జైలులోనికి వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి వారంతా గడువు ముగియకముందే జైలు ముందుకు వచ్చి బారులు తీరారు. 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తిహార్ జైలు ముందు ఖైదీలు బారులు తీరారు. వారంతా జైలులోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడి వరకు వచ్చిన తమ ఆప్తులకు వీడ్కోలు చెబుతున్నారు. జైలు లోపల అడుగు పెట్టడానికి క్యూ కట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి వారంతా జైలు ముందు వచ్చి నిలబడ్డారు. 

గత నెల 24వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌లు ఖైదీల గురించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా సమయంలో ఎమర్జెన్సీ బెయిల్ కింద విడుదల చేసిన విచారణ ఖైదీలు, ఖైదీలు స్వయంగా జైలు వద్దకు వచ్చి లొంగిపోవాలని ఆదేశించింది. 15 రోజుల్లో అంటే ఏప్రిల్ 8వ తేదీలోపు వారు జైలులో లొంగిపోవాలని తెలిపింది. గడువు ముగుస్తుండటంతో వారంతా జైలు ముందు క్యూ కట్టారు.

కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తున్న సమయంలో అంటే 2020లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన హైపవర్డ్ కమిటీ సిఫారసుల మేరకు విచారణ ఖైదీలు, దోషులకు అత్యవసర బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారు. తద్వార జైలులో కరోనా మహమ్మారి వ్యాపించకుండా అడ్డుకునే వీలు చిక్కింది.

అప్పుడు బెయిల్ కింద విడులైన వారంతా ఏప్రిల్ 8వ తేదీ లోపు వచ్చి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ ఖైదీలు కోర్టులో లొంగిపోయి తర్వాత బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించవచ్చునని వివరించింది. ఈ డెడ్ లైన్ ముగియనుండటంతో ఒక రోజు ముందే జైలు ముందు ఖైదీలు బారులు తీరారు.

Also Read: తెలంగాణలో షాపులు, రెస్టారెంట్లు 24 గంటలు తెరిచి ఉంచుకోవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

305 మంది ఖైదీలు రిటర్న్ వచ్చారని, అందులో 146 మంది విచారణ ఖైదీలు, 159 మంది దోషులుగా తేలిన ఖైదీలు అని తిహార్ జైలు అధికారి ఒకరు తెలిపారు.

మధ్యంతర బెయిల్, ఎమర్జెన్సీ పెరోల్ కింద ఢిల్లీలోని మూడు జైళ్లు రోహిని, మండోలి, తిహార్ జైళ్ల నుంచి 2020 ఫిబ్రవరి, మార్చి కాలంలో సుమారు 6 వేల మంది ఖైదీలను విడుదల చేశారు. ఇలా విడుదల చేసిన తర్వాతి ఏడాది వారిని లొంగి పోవాలని ఆదేశాలు వచ్చాయి. కానీ, లొంగిపోలేదు. దీంతో 2,400 మంది ఖైదీలను పరారీలో ఉన్నట్టుగా పేర్కొన్నారు. వారి పేర్లను ఢిల్లీ పోలీసులకు తెలియజేశారు. వారు ఆ ఖైదీలను పట్టుకునే పనిలో ఉన్నారు.

తిహార్ జైలు నుంచి 2020లో సుమారు 4,000 మంది ఖైదీలను విడుదల చేశారు.