Asianet News TeluguAsianet News Telugu

క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్రలో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌.. రూ.49,000 కోట్ల అభివృద్ది ప‌నుల‌కు శ్రీకారం

Bangalore: కర్ణాటక, మహారాష్ట్రల్లో రూ.49,000కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించనున్నారు. మొద‌ట కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ప‌లు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించిన త‌ర్వాత మ‌హారాష్ట్రలో ప‌లు ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. 

Prime Minister Narendra Modi's visit to Karnataka and Maharashtra; Development works worth Rs.49,000 crore initiated
Author
First Published Jan 19, 2023, 9:49 AM IST

PM Modi In Karnataka, Maharashtra: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మహారాష్ట్ర, కర్ణాటకలలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.49,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. బహుళ ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, పట్టణ ప్రయాణాన్ని సులభతరం చేయడం, భారతదేశ ఆర్థిక రాజధాని ముంబ‌యిలో ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ ప్ర‌జెక్టులు ఉన్నాయి. "నేను రేపు, జనవరి 19న కర్ణాటక, మ‌హారాష్ట్రలను సందర్శించాలని ఎదురు చూస్తున్నాను. వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు లేదా వాటి శంకుస్థాపనలు జరుగుతాయి. ఈ పనులు విభిన్న రంగాలను కవర్ చేస్తాయి. దేశ అభివృద్ధిని పెంచుతాయి" అని ప్ర‌ధాని మోడీ పేర్కొన్న‌ట్టు ఒక అధికారిక ప్రకటన తెలిపింది.

 

ప్రధాన మంత్రి క ర్ణాటకలోని యాదగిరి, కలబుర్గి జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు యాదగిరి జిల్లా కోడెకల్ లో సాగు, తాగునీరు, జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు కలబుర్గి జిల్లా మల్ఖేడ్ కు చేరుకున్న ప్రధాన మంత్రి అక్కడ కొత్తగా ప్రకటించిన రెవెన్యూ గ్రామాల అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు (హక్కుపాత్ర) పంపిణీ చేయడంతో పాటు జాతీయ రహదారి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ ముంబ‌యిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, జాతికి అంకితం చేయడం, శంకుస్థాపనలు చేస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ముంబ‌యి మెట్రోలోని రెండు లైన్లను ప్రారంభించడంతో పాటు మెట్రో రైడ్ లో కూడా పాలుపంచుకుంటారు.

ముంబ‌యిలో ప్రధాని మోడీ ప్రారంభించనున్న ప్రాజెక్టులు ఇవే.. 

1. రూ. 12,600 కోట్ల ముంబై మెట్రో రైల్ లైన్‌లను 2A, 7ను ప్రారంభించనున్నారు.

2. PM నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌ను కూడా ప్రారంభిస్తారు.

3. ఏడు STP ప్రాజెక్టుల శంకుస్థాపన కూడా జరుగుతుంది.

4. భాండప్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సిద్ధార్థ్ నగర్ హాస్పిటల్, ఓషివారా మెటర్నిటీ హోమ్‌ల పునరాభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేస్తారు.

5. ముంబ‌యిలో దాదాపు 400 కిలో మీట‌ర్ల రోడ్లను సిమెంట్ చేసే ప్రణాళికకు కూడా భూమిపూజ చేయనున్నారు.

6. రూ. 1,800 కోట్ల CSMT రీడెవలప్‌మెంట్‌కు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు.
 

క‌ర్నాట‌క‌లో..

ఇంటింటికీ వ్యక్తిగత కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలన్న ప్రధాన మంత్రి దార్శనికతను సాకారం చేసే ప్రయత్నంలో భాగంగా, జల్ జీవన్ మిషన్ కింద యాద్గిర్ బహుళ గ్రామ తాగునీటి సరఫరా పథకానికి యాదగిరి జిల్లా కోడెకల్ లో ప్ర‌ధాని శంకుస్థాపన చేయనున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ పథకం కింద 117 ఎంఎల్ డీ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను నిర్మించనున్నారు.  రూ.2050 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా యాదగిరి జిల్లాలోని 700కు పైగా గ్రామీణ ఆవాసాలు, మూడు పట్టణాల్లోని 2.3 లక్షల కుటుంబాలకు తాగునీరు అందుతుంది. అలాగే, నారాయణ పూర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ - ఎక్స్ టెన్షన్ రెనోవేషన్ అండ్ ఆధునీకరణ ప్రాజెక్టు (ఎన్ ఎల్ బీసీ - ఈఆర్ ఎం)ను కూడా పీఎం ప్రారంభిస్తారు. 10 వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా 4.5 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కలబుర్గి, యాదగిరి, విజయపూర్ జిల్లాల్లోని 560 గ్రామాల్లోని మూడు లక్షల మందికి పైగా రైతులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ.4700 కోట్లు.

Follow Us:
Download App:
  • android
  • ios