Asianet News TeluguAsianet News Telugu

బిర్సా ముండాకు నివాళులర్పించిన ప్రధాని మోడీ.. ప్రభుత్వ పథకాల వెనుక గిరిజనుల స్ఫూర్తి అంటూ వ్యాఖ్య

New Delhi: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు మంగళవారం (నవంబర్ 15, 2022) నాడు జంజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, గిరిజన నాయకుడు బిర్సా ముండాకు నివాళులు అర్పిస్తూ.. గిరిజన సంఘాలు తమ కళలు, చేతిపనులు, కృషితో దేశ జీవితాన్ని సుసంపన్నం చేశాయని కొనియాడారు.
 

Prime Minister Modi, President Murmu paid tribute to Birsa Munda; Tribal spirit behind government schemes
Author
First Published Nov 15, 2022, 1:09 PM IST

Prime Minister Narendra Modi: ఆదివాసీ గిరిజన నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు మంగళవారం (నవంబర్ 15, 2022) నాడు జంజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, గిరిజన నాయకుడు బిర్సా ముండాకు నివాళులు అర్పిస్తూ.. గిరిజన సంఘాలు తమ కళలు, చేతిపనులు, కృషితో దేశ జీవితాన్ని సుసంపన్నం చేశాయని కొనియాడారు.

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం బిర్సా ముండాకు నివాళులు అర్పించారు. తమ ప్రభుత్వ వివిధ పథకాల వెనుక గిరిజన సమాజం స్ఫూర్తి ఉందని అన్నారు.  ప్రధాని తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ అనేక సంక్షేమ కార్యక్రమాలను ఉదహరించారు.  కోట్లాది గిరిజన కుటుంబాలు వాటి నుండి లబ్ది పొందాయనీ, వారి జీవితాలు సులభతరం అయ్యాయని పేర్కొన్నారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల సేవలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా మ్యూజియంలను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. బిర్సా ముండా జన్మదినాన్ని 'జంజాతీయ గౌరవ్ దివస్'గా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. బిర్సా ముండా, అనేక ఇతర గిరిజన వీరుల కలలను నెరవేర్చడానికి దేశం ముందుకు సాగుతుందని ప్రధాని అన్నారు.

ముండా స్వాతంత్ర్య పోరాటానికి చిహ్నం మాత్రమే కాదు, దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక శక్తిని సూచిస్తుందని పేర్కొన్నారు.  ముండాతో పాటు ఇతర ప్రముఖ గిరిజన విప్లవకారులలో తిల్కా మాంఝీ, సిద్ధూ, కన్హు, తానా భగత్‌ల గురించిన విషయాలను ప్రస్తావిస్తూ.. విదేశీ పాలకులకు వ్యతిరేకంగా వారి పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు.

 

అలాగే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జంజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంఘాలు తమ కళలు, చేతిపనులు, కృషితో దేశ జీవితాన్ని సుసంపన్నం చేశాయని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో గిరిజన సంఘాలు గొప్పగా కృషి చేశాయని ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. “నేను ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధులు, ఆయా వర్గాల కోసం పోరాటం సాగించిన వీరులందరికీ నమస్కరిస్తున్నాను. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జాతి ప్రయాణంలో గిరిజనుల సహకారం తక్కువేమీ కాదు. వారి అభివృద్ధి, శ్రేయస్సు కోసం నా శుభాకాంక్షలు” అని ముర్ము అన్నారు. “జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా, తోటి పౌరులకు, ముఖ్యంగా గిరిజన సమాజంలోని సోదరులు, సోదరీమణులకు నా శుభాకాంక్షలు! గిరిజన సంఘాలు తమ కళలు, హస్తకళలు, కృషితో దేశ జీవితాన్ని సుసంపన్నం చేశాయి. వారి జీవనశైలి ప్రకృతిని పెంపొందించడంలో ప్రపంచానికి పాఠాలను అందిస్తుంది” అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios