New Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీలో మొట్టమొదటి జాతీయ శిక్షణా సదస్సును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుకు వస్తున్న సవాళ్లను నవభారతం కోసం అవకాశాలుగా మారుస్తూనే ఉంటామని చెప్పారు.
PM Modi Inaugurates 1st National Training Conclave: ముందుకు వస్తున్న సవాళ్లను నవభారతం కోసం అవకాశాలుగా మారుస్తూనే ఉంటామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో మొట్టమొదటి జాతీయ శిక్షణా సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ ల మధ్య సహకారాన్ని పెంపొందించడం, దేశవ్యాప్తంగా సివిల్ సర్వెంట్లకు శిక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే లక్ష్యంతో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దీన్ని నిర్వహించింది.
వివరాల్లోకెళ్తే.. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో తొలిసారిగా జాతీయ శిక్షణ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా సివిల్ సర్వెంట్లకు శిక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే ఈ సదస్సు లక్ష్యం. దీనికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆతిథ్యం ఇచ్చింది. సెంట్రల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్స్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్స్, రీజినల్ అండ్ జోనల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్స్, రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్స్ సహా వివిధ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లకు చెందిన 1,500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలకు చెందిన సివిల్ సర్వెంట్లతో పాటు ప్రయివేటు రంగానికి చెందిన నిపుణులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
ఈ రోజు జాతీయ శిక్షణా సదస్సు మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి, సేవ చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఇది భాగమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, అంతరాలను అంతం చేయడం, సేవలను పెంపొందించే ప్రాముఖ్యతను ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. నవభారత నిర్మాణం కోసం ప్రభుత్వం సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూనే ఉంటుందన్నారు. "ఈ వైవిధ్యమైన సమావేశం ఆలోచనల మార్పిడిని ప్రోత్సహిస్తుంది.. ఎదుర్కొంటున్న సవాళ్లను-అందుబాటులో ఉన్న అవకాశాలను గుర్తిస్తుంది. మన సామర్థ్యాన్ని పెంపొందించడానికి కార్యాచరణ పరిష్కారాలు-సమగ్ర వ్యూహాలను సృష్టిస్తుంది" అని ప్రకటనలో పేర్కొన్నారు. ఫ్యాకల్టీ డెవలప్ మెంట్, ట్రైనింగ్ ఇంపాక్ట్ అసెస్ మెంట్, కంటెంట్ డిజిటలైజేషన్ వంటి సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లకు సంబంధించిన కీలక అంశాలపై ఎనిమిది ప్యానెల్ల చర్చలు జరిగాయి.
