ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడుకు చేరుకొని అక్కడి చెన్నై ఎయిర్ పోర్టులో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ ను ప్రారంభించారు. ప్రధానికి సీఎం స్టాలిన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓ పుస్తకాన్ని బహుకరించారు. 

తెలంగాణ పర్యటన ముగిసిన అనంతరం నేరుగా ప్రధాని మోడీ తమిళనాడుకు చేరుకున్నారు. చెన్నైలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఆయనకు సీఎం స్టాలిన్ ఘన స్వాగతం పలిచారు. ఈ సందర్భంగా రామస్వామి రచించిన ‘గాంధీ ట్రావెల్స్ ఇన్ తమిళనాడు’ అనే పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు. అనంతరం చెన్నై ఎయిర్ పోర్టులో నూతనంగా రూ.1,260 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ (ఫేజ్-1)ను ఆయన ప్రారంభించారు.

బీజేపీలో చేరిన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు సీ.రాజగోపాలాచారి మనవడు కేశవన్..

ఈ కార్యక్రమానికి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవ అనంతరం టెర్మినల్ చుట్టూ తిరుగుతూ ప్రధాని, స్టాలిన్ తో స్నేహపూర్వకంగా మెలిగారు. ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. ఈ సమయంలో ప్రధాని మోడీ, సీఎం స్టాలిన్ చేయి పట్టుకున్నారు.

Scroll to load tweet…

కాగా.. చెన్నై విమానాశ్రయ ఆధునీకరణలో భాగంగా రూ.1,260 కోట్ల వ్యయంతో ఈ కొత్త టెర్మినల్ ను అభివృద్ధి చేశారు. ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం కనెక్టివిటీని పెంచుతుంది. అంతర్జాతీయ కార్యకలాపాలన్నీ కొత్త భవనంలోకి తరలిపోనున్నాయి. ఇది 2,200,000 చదరపు మీటర్ల వ్యాసార్థంలో ఉంది. సంవత్సరంలో సుమారు 35 మిలియన్ల మంది ప్రయాణికులకు వసతి కల్పిస్తుంది. ఈ టెర్మినల్ ఎంట్రీ, ఎగ్జిట్ లలో 54 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఉన్నాయి. ఇవి విమానాశ్రయంలో ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించనున్నాయి. టెర్మినల్లో క్యారీ-ఆన్ బ్యాగేజ్ కోసం 11 ఆటోమేటిక్ ట్రే రిట్రీవల్ సిస్టమ్స్ (ఏటీఆర్ఎస్), అలాగే 33 రిమోట్ బోర్డింగ్ గేట్లు ఉన్నాయి. 

Scroll to load tweet…

ఈ టెర్మినల్ తమిళనాడు సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించారు. భవనంలోని ప్రతీ డిజైన్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ‘‘ కొత్త టెర్మినల్ స్థానిక తమిళ సంస్కృతికి అద్భుతమైన ప్రతిబింబం. కోలం, చీర, దేవాలయాలు ఇతర అంశాలను కలిగి ఉంది’’ అని తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 

బామ్మా నువ్వు గ్రేట్.. చెట్టును ఢీకొట్టకుండా రైలును ఆపిన వృద్ధురాలు..ఆపరేషన్ జరిగినా పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ

‘‘ తాటిచెట్టు విజువల్ ఎఫెక్ట్ ను సృష్టించేలా స్తంభాలను డిజైన్ చేశాం. పైకప్పులను మోటిఫ్ లైట్లతో అలంకరించాం. దక్షిణ భారతదేశంలోని కోలామ్ (రంగోలి) నమూనాలు ఉన్నాయి. పైకప్పు డిజైన్ భరతనాట్యం నుంచి వచ్చింది’’ అని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది.