అయోధ్యలో 2 వేల అడుగుల లోతులో టైమ్స్ క్యాప్సూల్
అయోధ్యలో నిర్మించనున్న శ్రీరామ మందింరంలో రెండు వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సూల్ ను ఉంచనున్నారు.
అయోధ్య:అయోధ్యలో నిర్మించనున్న శ్రీరామ మందింరంలో రెండు వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సూల్ ను ఉంచనున్నారు.
ఈ ఏడాది ఆగష్టు 5 వ తేదీన రామ మందిర నిర్మాణానికి బూమి పూజ నిర్వహించనున్నారు. రెండు వేల అడుగుల లోతులో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన చరిత్రతో పాటు వివరాలను ఇందులో ఉంచనున్నారు. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఓ ప్రకటనలో తెలిపింది.
also read:అయోధ్యలో భూమి పూజ: 800 కి.మీ పాదయాత్రగా బయలుదేరిన ముస్లిం
రానున్న తరాలకు ఈ ఆలయ చరిత్ర తెలుసుకొనేందుకు వీలుగా టైమ్ క్యాప్యూల్ దోహదపడుతోందని కమిటి ప్రకటించింది.భూగర్భంలో ఈ చరిత్రను నిక్షిప్తం చేసేందుకు ముందు టైమ్ క్యాప్యూల్ ను రాగిరేకు లోపల భద్రపర్చనున్నట్టుగా ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ చెప్పారు.
ఆగష్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఆలయ కమిటి నిర్వహిస్తోంది. ఈ ఏర్పాట్లను ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుమతిస్తూ 2019 నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని కూడ సుప్రీం ఆదేశించింది.