సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆకాశాన్ని తాకిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించింది. సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆకాశాన్ని తాకిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించింది. సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కోట్లాది మందికి ఊరట లభించే అవకాశం వుంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి రాజస్థాన్, మిజోరం, తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు కీలకమైన ఈ రాష్ట్రాల్లో గెలవడం బీజేపీకి ఆవశ్యకం. ఈ నేపథ్యంలో మధ్యతరగతి, పేదలను సంతృప్తి పరచడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

అయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజనా పథకం లబ్ధిదారులకు కేంద్రం నిర్ణయంతో ప్రయోజనం దక్కనుంది. ఇప్పటికే కేంద్రం ఎల్పీజీ సిలిండర్లపై రూ.200 రాయితీ ఇస్తోంది. ఇప్పుడు తాజాగా మరో రూ.200 ఇవ్వనుంది. దీంతో పీఎంయూవై లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ.400 వరకు ప్రయోజనం పొందొచ్చు. ప్రస్తుతం దేశంలో సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.1100 నుంచి రూ.1120 వరకు వుంటోంది.