తాను రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉండటం లేదని ఎన్సీపీ అధినేత శరాద్ పవర్ తెలిపారు. సోమవారం నిర్వహించిన తన పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు.
వచ్చే నెలలో భారత రాష్ట్రపతి పదవి కోసం ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఉండే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ ఈ ఊహాగానాలకు అయన చెక్ పెట్టారు. తాను రాష్ట్రపతి అభ్యర్థి రేసులో లేనని కుండబద్దలు కొట్టారు. సోమవారం సాయంత్రం ముంబైలో జరిగిన తన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘‘నేను రేసులో లేను.. రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిని కాను’’ తెలిపారు.
వంటనూనెలో ఉమ్మివేసిన పాప్ కార్న్ వ్యాపారి.. అరెస్ట్..
అయితే ఈ నిర్ణయాన్ని శరద్ పవార్ అధికారికంగా కాంగ్రెస్ ఇంకా తెలియజేయలేదు. రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడాలని గత వారం కాంగ్రెస్ ఆయనను సంప్రదించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంలో పవార్ విముఖంగా ఉన్నారు. కాబట్టి ఇక ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైన మెజారిటీని సాధించుకోవడం కష్టంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓడిపోయే పోరులో నిలిచేందుకు పవార్ మొగ్గు చూపడం వారు చెబుతున్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పెద్ద దెబ్బలు తిన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో శివసేన అభ్యర్థి సంజయ్ పవార్‌ను బీజేపీ వ్యూహంతో ఓడించింది. మొదటి నుంచి శివసేనకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చిన పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపు తిప్పుకుంది. దీంతో కీలకమైన మూడో సీటును ఆ పార్టీ కైవసం చేసుకుంది.
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం అయిన ఎంవీఏ (మహా వికాస్ అఘాడీ) మిత్రపక్షాలుగా ఉన్న శివసేన, కాంగ్రెస్ పార్టీలు శరద్ పవార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సూచనలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గత గురువారం ఎన్సీపీ అధినేత ముంబైలోని ఆయన నివాసంలో కలిశారు. అలాగే ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సూచనతో పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ ఆదివారం శరద్ పవార్ కు ఫోన్ చేసి మాట్లాడారు.
గుడ్ న్యూస్.. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని ప్రధాని మోదీ ఆదేశం
కాగా మల్లికార్జున్ ఖర్గే.. శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌లతో కూడా మాట్లాడారు. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా ఆయన ఫోన్ లో సంప్రదించారు. అయితే ఆమె కూడా ఇదే విషయంపై చర్చించేందుకు రేపు (బుధవారం) ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. భారతదేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరైన మిస్టర్ పవార్.. గత కొన్ని దశాబ్దాలుగా అనేక సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో, విచ్ఛిన్నం చేయడంలో కీలకంగా ఉన్నారు. మహారాష్ట్రలో కూడా బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా చేసేందుకు.. సైద్దాంతికంగా వ్యతిరేక పార్టీలైన శివసేన, కాంగ్రెస్‌లను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలతో కలిసి మహా వికాస్ అఘాడీ అనే పేరుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
Prophet Row : నూపుర్ శర్మ వ్యాఖ్యలు.. రాజస్థాన్ లో బీజేపీ నాయకురాలి రాజీనామా..
ప్రస్తుత భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవి కాలం జూలై 24వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో జూలై 18న రాష్ట్రపతి పదవి కోసం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మూడు రోజుల తరువాత కౌంటింగ్ చేపట్టాలని భావిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్లతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 4,809 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా కలిసి కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్ర జనాభా, అసెంబ్లీ స్థానాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీ మొత్తం బలం 10,86,431 గా ఉంది. అయితే ఏ అభ్యర్థి అయినా 50 శాతం ఓట్లు దాటితే గెలుస్తారు. కాగా బీజేపీ, దాని మిత్రపక్షాలు మెజారిటీ మార్కుకు 13,000 ఓట్ల దూరంలో ఉన్నాయి. 2017లో ఎన్డీఏ అభ్యర్థికి తెలంగాణ నుంచి అధికార టీఆర్ఎస్, ఎపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్, ఒడిశా అధికార పార్టీ BJD మద్దతు లభించింది. అయితే ఈసారి సీఎం కేసీఆర్ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ఆయన బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు విపక్ష శక్తులను కూడగట్టే ప్రయత్నాల్లో బిజీ బిజీగా ఉన్నారు.
