బెంగళూరులో దారుణం జరిగింది. ఓ పాప్ కార్న్ వ్యాపారి వంటనూనెలో ఉమ్మి వేస్తున్నాడని వినియోగదారులు ఆరోపించడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరు : లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో ఓ పాప్‌కార్న్ అమ్మేవ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతను పాప్ కార్న్ తయారీకి ఉపయోగించిన వంట నూనెలో ఉమ్మివేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో 21 ఏళ్ల ఆ వ్యక్తిని శనివారం ఉదయం అరెస్టు చేశారు. సదరు వ్యక్తి నవాజ్ పాషా అని అతను సోమేశ్వరనగర్, జయనగర్ 1వ బ్లాక్‌లో నివాసముంటున్నాడని తెలిపారు.
లాల్‌బాగ్‌లో కానిస్టేబుల్ మల్లినాథ్ డ్యూటీలో ఉండగా గ్లాస్ హౌస్ దగ్గర జనాలు పెద్ద సంఖ్యలో గుమికూడడాన్ని గమనించి సిద్దాపుర పోలీసులు సమాచారం అందించాడు. ఆ తరువాత మల్లినాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాడు. అక్కడ, గుమిగూడిన జనం పాప్ కార్న్ చేసే వ్యక్తి దాని తయారీకి వాడే నూనెలో ఉమ్మి వేస్తున్నాడని తెలిపారు. దీంతో ఆ ప్రాంతం అంతా గొడవ గొడవగా ఉంది.
దీంతో మల్లినాథ్ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని సీనియర్ అధికారులను అప్రమత్తం చేశారు. మరింత మంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పాప్‌కార్న్ తయారీ యంత్రం, వంటనూనెను స్వాధీనం చేసుకున్నారు. అయితే, తను నూనెలో ఉమ్మి వేస్తున్నానన్న ఆరోపణలను పాషా కొట్టిపారేశాడు. కానీ, అయితే సీసాలో నూనె పోసేందుకు వంటనూనె ప్యాకెట్ ను కొరికినట్లు అంగీకరించాడు.
దారుణం.. కొత్తగా పెళ్లైన చెల్లిని, బావను విందుకు పిలిచి.. కొడవళ్లతో నరికి చంపిన అన్న..
అనుమానితుడు పరిశుభ్రత పాటించలేదని, ఆయిల్ పాకెట్ కొరకడం ఇతరులకు ఆరోగ్యకరం కాదని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు పాషాపై సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోలీసులు పాషాపై IPC సెక్షన్లు 269 (నిర్లక్ష్యంతో ప్రాణాంతకమైన వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశం), 270 (ప్రాణాంతకమైన వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశం), 272 (అమ్మకానికి ఉద్దేశించిన ఆహారం లేదా పానీయాలలో కల్తీ చేయడం), 273 (నష్టకరమైన ఆహారం లేదా పానీయాల అమ్మకం) కింద అభియోగాలు మోపారు. అతనిపై మోపిన అభియోగాలు బెయిలబుల్ నేరాలు కావడంతో స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.
