నేడు జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓట్ వేయమని తమ ఎమ్మెల్యేలను ఏ పార్టీ ఒత్తిడి చేయకుండా ఉండాలని బీజేపీ భావించింది.

పశ్చిమబెంగాల్ : నేడు రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌లోని బీజేపీ రాష్ట్ర అసెంబ్లీలోని తన 69 మంది ఎమ్మెల్యేలను బీజేపీ ఆదివారం ఓ హోటల్‌కు మార్చింది. నేడు జరగబోయే రాష్ట్రపత్రి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగకుండా ఉండేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కోల్‌కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలోని 5-స్టార్ హోటల్‌లో ఉంచింది.

దీనిమీద రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా ఓటు వేయాలనే దానిపై ఎమ్మెల్యేలు వర్క్‌షాప్‌లో ఉన్నారని బీజేపీ అధికారికంగా పేర్కొంది. నేటి ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యేలను నేరుగా అసెంబ్లీకి తీసుకెళతారు అక్కడ వారు తమ ఓటు వేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటు వేయమని తమ ఎమ్మెల్యేలను ఏ పార్టీ ప్రలోభ పెట్టడం కానీ, ఒత్తిడి పెట్టడం కానీ చేయకూడదని బీజేపీ భావించింది. అందుకే ఇలాంటి చర్యలు చేపట్టింది. బెంగాల్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి చర్యలే చేపట్టారు.

మహారాష్ట్ర
ముంబైలోని 5-స్టార్ హోటల్‌లో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియల గురించి బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి, ఆయన డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరూ హోటల్‌లో ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు రాత్రి హోటల్‌లోనే బస చేశారు. నేటి ఉదయం నేరుగా విధానసభకు తరలివెళ్లనున్నారు.

Presidential Election 2022 : నేడే రాష్ట్రపతి ఎన్నిక..

గోవా
ఇలా ఎమ్మెల్యేలను హైడ్ చేస్తున్న వారిలో కేవలం బీజేపీ మాత్రమే లేదు. కాంగ్రెస్ కూడ ఉంది. కాంగ్రెస్ గోవాలోని తన 11 మంది ఎమ్మెల్యేలలో ఐదుగురిని ప్రీజ్ పోల్‌లో క్రాస్ ఓటింగ్ భయంతో చెన్నైలోని హోటల్‌కు తరలించింది. కోస్తా రాష్ట్రంలో పార్టీ యూనిట్‌లో తిరుగుబాటు జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది.

ప్రెసిడెన్షియల్ ఎలక్షన్
జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు, జూలై 21న ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్ల లెక్కింపు ఢిల్లీలో నిర్వహిస్తారు.ఈ ఎన్నికల్లో మొత్తం 4,809 మంది ఓటర్లు ఓటు వేస్తారని, ఏ రాజకీయ పార్టీ వీరికే ఓటు వేయాలంటూ తమ సభ్యులకు విప్ జారీ చేయదని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 2017లో ఎన్నికైన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2022 జూలై 24 వరకు పదవిలో ఉంటారు.