నిర్భయ హత్యాచార కేసు నిందితుల్లో ఒకడైన పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. సోమవారం ఉదయం క్షమాభిక్ష పిటిషన్‌ను పవన్ దాఖలు చేశాడు. దీంతో నలుగురు దోషులను మంగళవారం తీహార్ జైలులో ఉరి తీయనున్నారు. 

నిర్భయ హత్యాచార కేసు నిందితుల్లో ఒకడైన పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. సోమవారం ఉదయం క్షమాభిక్ష పిటిషన్‌ను పవన్ దాఖలు చేశాడు. దీంతో నలుగురు దోషులను మంగళవారం తీహార్ జైలులో ఉరి తీయనున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరో వైపు ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని దోషుల తరపున అక్షయ్ కుమార్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అయితే సహజ న్యాయ సూత్రాల ప్రకారంగా ఉరిశిక్షకు గురైన దోషులకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్ లో ఉన్న సమయంలో వారిని ఉరితీయకూడదని చెబుతున్నాయి. అయితే ఎవరి పిటిషన్లు పెండింగ్ లో ఉంటే వారిని ఉరితీయడం నుండి మినహాయించి ఇతరులను ఉరి తీయాలని ప్రభుత్వాలు కోర్టులను కోరాయి. 

Also Read:నిర్భయ దోషులకు షాక్: స్టేకు ఢిల్లీ కోర్టు నిరాకరణ, రేపే ఉరిశిక్షకు ఛాన్స్?

నిర్భయ కేసులోని నలుగురు దోషులకు మార్చి 3వ తేదీన ఉరిశిక్షను అమలు చేయాలని పాటియాల హౌస్ కోర్టు ఇటీవల డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరణశిక్షపై స్టే విధించాలని కోరుతూ ఇద్దరు దోషులు ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే

అక్షయ్ సింగ్, పవన్ గుప్తా స్టే కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. తాను తాజాగా రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నానని, అది పెండింగులో ఉందని అక్షయ్ సింగ్ తన తరఫు న్యాయవాది ద్వారా కోర్టుకు తెలియజేశాడు.

ఇంతకు ముందు రాష్ట్రపతి తిరస్కరించిన మెర్సీ పిటిషన్ లో పూర్తి వాస్తవాలు లేవని అక్షయ్ సింగ్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ చెప్పారు. ఈ పిటిషన్‌పై ఇవాళ పాటియాల కోర్టు తీర్పును వెల్లడించింది. 

Also Read:నిర్భయ కేసు: పవన్ గుప్తాకు సుప్రీం షాక్, క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత

నలుగురు దోషులను మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని కోర్టు ఫిబ్రవరి 17వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. అయితే పాటియాల కోర్టు తీర్పు మేరకు రేపు ఉరిశిక్షపై అధికారులు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ముకేష్ కుమార్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ కుమార్ శర్మ (26), అక్షయ్ కుమార్ (31)లకు ఉరిశిక్ష విధించాలని డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.