నిర్భయ కేసులో దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది.

నిర్భయ కేసులో తనకు విధించిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని    పవన్ గుప్తా  క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్‌ను కొట్టివేసింది.

Also read:నిర్భయ కేసు, ఉరి అనుమానమే: కోర్టుకెక్కిన ఇద్దరు దోషులు

మార్చి 3వ తేదీన ఉరిశిక్ష అమలు కాకుండా నిర్భయ కేసు దోషులు మరో ఎత్తు వేశారు. నిర్భయ కేసులోని నలుగురు దోషులకు మార్చి 3వ తేదీన ఉరిశిక్షను అమలు చేయాలని పాటియాల హౌస్ కోర్టు ఇటీవల డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరణశిక్షపై స్టే విధించాలని కోరుతూ ఇద్దరు దోషులు ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

అక్షయ్ సింగ్, పవన్ గుప్తా స్టే కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. తాను తాజాగా రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నానని, అది పెండింగులో ఉందని అక్షయ్ సింగ్ తన తరఫు న్యాయవాది ద్వారా కోర్టుకు తెలియజేశాడు. ఇంతకు ముందు రాష్ట్రపతి తిరస్కరించిన మెర్సీ పిటిషన్ లో పూర్తి వాస్తవాలు లేవని అక్షయ్ సింగ్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ చెప్పారు.  ఈ పిటిషన్‌పై ఇవాళ పాటియాల కోర్టు తీర్పును వెల్లడించనుంది.

నలుగురు దోషులను మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని కోర్టు ఫిబ్రవరి 17వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. అయితే   పాటియాల కోర్టు తీర్పు మేరకు రేపు  ఉరిశిక్షపై అధికారులు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  ముకేష్ కుమార్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ కుమార్ శర్మ (26), అక్షయ్ కుమార్ (31)లకు ఉరిశిక్ష విధించాలని డెత్ వారంట్ జారీ చేసింది.