కరుణానిధిని పరామర్శించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

president ramnath kovind meets karunanidhi
Highlights

అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  పరామర్శించారు.

అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  పరామర్శించారు. హైదరాబాద్ నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న రాష్ట్రపతి విమానాశ్రయం నుంచి నేరుగా కావేరి ఆసుపత్రి వద్దకు చేరుకుని కరుణానిధిని పరామర్శించారు. అనంతరం కలైంజర్ కుమారుడు స్టాలిన్‌, కుమార్తె కనిమొళితో సమావేశమై చికిత్స వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతి వెంట తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ తదితరులు ఉన్నారు.

loader