కరోనా ఎఫెక్ట్: మాస్కులను కుట్టిన రాష్ట్రపతి సతీమణి
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భార్య సవితా కోవింద్ కరోనాపై వ్యతిరేక పోరులో తనవంతు చేయూతను అందిస్తున్నారు. రాష్ట్రపతి భవన్ లోని శక్తిహాత్ వద్ద స్వయంగా కుట్టు మిషన్‌పై ఫేస్ మాస్కులు కుడుతున్నారు.
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భార్య సవితా కోవింద్ కరోనాపై వ్యతిరేక పోరులో తనవంతు చేయూతను అందిస్తున్నారు. రాష్ట్రపతి భవన్ లోని శక్తిహాత్ వద్ద స్వయంగా కుట్టు మిషన్‌పై ఫేస్ మాస్కులు కుడుతున్నారు.
కరోనా పోరులో సవితా కోవింద్ తన వంతు ప్రాత పోషిస్తున్నారు. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డు ద్వారా వివిధ ప్రదేశాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి ఈ మాస్కులను అందించనున్నారు.
also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకొన్న జంట
ఈ మాస్కులను కుట్టే సమయంలో ఆమె ముఖానికి కూడ మాస్కును ధరించారు. కరోనా వ్యతిరేక పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలనే సందేశాన్ని రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్ ఇచ్చారు.
భారత్‌లో కరోనా కేసులు గురువారం ఉదయం నాటికి 20, 471 నమోదవ్వగా.. 652 మంది మృత్యువాత పడ్డారు. 3960 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను అమలు చేసిన విషయం తెలిసిందే.