Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రపతి ఆమోదం: చట్టంగా మారిన వ్యవసాయ బిల్లులు

నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం ఆమోదముద్ర వేశారు. ఇటీవల ఈ బిల్లులను పార్లమెంట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే

President Ram Nath Kovind gives assent to three farm bills
Author
New Delhi, First Published Sep 27, 2020, 8:01 PM IST

నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం ఆమోదముద్ర వేశారు. ఇటీవల ఈ బిల్లులను పార్లమెంట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి ఆదివారం బిల్లులకు ఆమోద ముద్ర వేయడంతో అవి చట్టరూపం దాల్చాయి.

కాగా వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ పంజాబ్ రైతాంగం ఆందోళనకు దిగింది. ఈ నెల 25న పంజాబ్ రాష్ట్రంలో బంద్ కు 31 రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. పంజాబ్ రాష్ట్రంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

వ్యవసాయ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విపక్షాల నిరసనల మధ్యే రాజ్యసభలో ఈ బిల్లులకు ఆమోదం లభించింది.ఈ బిల్లులు ఆమోదం పొందడంపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి.

Also Read:రాజ్యసభలో విపక్షాల నిరసనలు: వ్యవసాయ బిల్లులకు ఆమోదం

వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఆధ్వర్యంలో అమృత్ సర్ లో రైతులు రైలు రోకోలు నిర్వహించారు. బీజేపీ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకోవాలని రైతు సంఘాలు కోరాయి.

వ్యవసాయ బిల్లులకు అనుకూలంగా ఓటు చేసిన వారిని బాయ్ కాట్ చేయాలని రైతులు సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.సెప్టెంబర్ 25న కొందరు, అక్టోబర్ 1న బంద్ కు పిలుపునిచ్చారు.రేపటి నిరసనల దృష్ట్యా పిరోజ్ పూర్ రైల్వే డివిజన్ ముంబైతో పంజాబ్ రాష్ట్రం గుండా వెళ్లే 14 రైళ్లను రద్దు చేశారు. 

ఈ బిల్లులతో రైతులకు నష్టం జరుగుతోందని రైతు సంఘాలు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కార్పోరేట్ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై తాము ఆధారపడాల్సి వస్తోందని పంజాబ్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios