కామంతో కళ్లు మూసుకుపోయిన ఎనిమింది యువకులు మూగ జీవిని కూడ వదల్లేదు. జంతువులు కూడ సిగ్గుపడేలా వ్యవహరించారు ఆ దుర్మార్గులు. 8 మంది నిందితుల పశువాంఛకు ఓ మేక ప్రాణాలు కోల్పోయింది
ఛండీగఢ్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఎనిమింది యువకులు మూగ జీవిని కూడ వదల్లేదు. జంతువులు కూడ సిగ్గుపడేలా వ్యవహరించారు ఆ దుర్మార్గులు. 8 మంది నిందితుల పశువాంఛకు ఓ మేక ప్రాణాలు కోల్పోయింది. గర్భంతో ఉన్న మేకపై 8 మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మేక ప్రాణాలను కోల్పోయింది.
పంజాబ్ రాష్ట్రంలోని మేవాత్‌లో బుధవారం నాడు అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది. మద్యం మత్తులో మొత్తం 8 మంది యువకులు మేకపై అత్యాచారం చేశారు.
మద్యం మత్తులో కామంతో నిందితులు మేకపై అత్యాచారానికి పాల్పడడంతో ఆ మూగజీవి అరిచింది.
మేక అరుపులకు నిద్ర లేచిన యాజమాని అస్లూ జరుగుతున్న ఘోరం చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే తేరుకొని ఇరుగుపొరుగువారిని నిద్రలేపాడు. కేకలు వేయటంతో భయపడ్డ నిందితులు పరారయ్యారు.
మేకను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మేక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై నగిన పోలీస్ స్టేషన్‌లో అస్లూ ఫిర్యాదు చేశారు. మేకపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉంటే మేకపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు కోరుతుతన్నారు. ఈ ఘటనపై పెటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
