చంద్రయాన్ -3 విజయవంతం కావాలని ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ముస్లింలు ప్రార్థించారు. లక్నోలోని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియాలో సోమవారం ముస్లింలు నమాజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను  ఏషియా న్యూ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసింది.

చంద్రయాన్ -3 విజయం సాధించాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు. దేవలయాల్లో, మసీదుల్లో అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు. భారతీయ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 06.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్ దిగనుంది. దీని కోసం భారతీయులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

కాగా.. చంద్రయాన్ - 3 చంద్రుడిపై సేఫ్ గా ల్యాండ్ అవ్వాలని ముస్లింలు లక్నోలోని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియాలో సోమవారం నమాజ్ చేశారు. మూన్ విషన్ విజయం సాధించాలని ప్రార్థించారు. దీనికి సంబంధించిన వీడియోను ఏషియా న్యూ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసింది. అందులో భారత మూన్ మిషన్ కోసం ముస్లింలు ప్రార్థిస్తున్నారు. 

Scroll to load tweet…

ఎక్స్ (ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్ కూడా చంద్రయాన్ -3 విజయం సాధించాలని ఆకాక్షించారు. ఈ ప్రతిష్టాత్మక అంతరిక్ష మిషన్ చేపట్టిన భారతదేశానికి శుభాకాంక్షలు తెలిపారు. యునైటెడ్ కింగ్ డమ్ భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి లండన్ లో మాట్లాడుతూ.. ఒక దేశంగా భారత్ సాధించిన అసాధారణ విజయానికి ఇంతకంటే గొప్ప ప్రకటన మరొకటి ఉండదన్నారు.

‘ఒక దేశంగా భారత్ సాధించిన అద్భుత విజయానికి ఇంతకంటే గొప్ప ప్రకటన మరొకటి ఉండదు. ఇది కేవలం భారత దౌత్యవేత్తగా కాకుండా గర్వించదగిన భారతీయుడిగా చెబుతున్నాను’ అని అన్నారు. ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్నప్పుడే భారత్ అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.

‘భారత్ కు ఆర్థిక వనరులు చాలా తక్కువగా ఉన్న సమయంలో మేము మా అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించాము. నేడు ఇది కేవలం మానవ కల్పనకు మాత్రమే పరిమితమైన అంతరిక్ష కార్యక్రమం. చంద్రుడిపై దేనినైనా ల్యాండ్ చేయగల అతికొద్ది దేశాల్లో మనమూ ఒకటి. ఇది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి కంటే ముందుంది’ అని ఆయన పేర్కొన్నారు. కొన్ని హాలీవుడ్ సినిమాల కంటే తక్కువ ధరకే ఈ స్పేస్ ప్రోగ్రామ్ ను నేటికీ నడపగలిగామని దొరైస్వామి తెలిపారు. ‘ఇది ఖర్చుతో కూడుకున్నది, సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది... ఇది నిజంగా యువతలో ఊహాశక్తిని రేకెత్తించే విషయం’ అని పేర్కొన్నారు.

కాగా.. చంద్రయాన్ -3 సాఫ్ట్ ల్యాండింగ్ పై ఇస్రో మంగళవారం ఒక అప్ డేట్ ఇచ్చింది. మిషన్ షెడ్యూల్ లో ఉందని, వ్యవస్థలు క్రమం తప్పకుండా తనిఖీలకు లోనవుతున్నాయని పేర్కొంది. ‘‘సజావుగా సాగిపోతున్నది. మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ (ఇస్రోలో) శక్తి, ఉత్సాహంతో కిటకిటలాడుతోంది.’’ అని ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇందులో 70 కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా (ఎల్పీడీసీ) తీసిన చంద్రుడి చిత్రాలను కూడా ఇస్రో విడుదల చేసింది.

ఇదిలా ఉండగా.. రష్యా పంపించిన లూనా-25 మిషన్ విఫలమైన తరువాత అందరి దృష్టి చంద్రయాన్ -3 పై పడింది. మన మూన్ మిషన్ నేటి సాయంత్రం చంద్రుడిపై కాలు మోపడానికి సిద్ధమైంది. భారతీయులే కాక ప్రపంచం మొత్తం దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే డింగ్ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం బుధవారం సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమవుతుంది. ల్యాండింగ్ లైవ్ ను ఇస్రో వెబ్ సైట్, దాని యూట్యూబ్ ఛానెల్, ఫేస్ బుక్, పబ్లిక్ బ్రాడ్కాస్టర్ డీడీ నేషనల్ టీవీలో బుధవారం సాయంత్రం 5:27 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.