న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు మంగళవారం నాడు ఢిల్లీలో నిర్వహించనున్నారు.

ఈ నెల 10వ తేదీన అనారోగ్యంతో ఆర్మీ ఆసుపత్రిలో చేరాడు. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు ఆయన కన్నుమూశారు. ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 

ఢిల్లీలోనే ప్రణబ్ అంత్యక్రియలను సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించనున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మృతికి సంతాపంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది.

మాజీ రాష్ట్రపతి మృతికి సంతాపంగా ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న జాతీయ పతాకాలను అవనతం చేశారు.  సెప్టెంబర్ 6వ తేదీ వరకు  సంతాప దినాలు నిర్వహించనున్నారు. 2012 ligcr 2017 వరకు రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పనిచేశారు. 

also read:ప్రణబ్ ముఖర్జీ మృతి: ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడుగా ప్రణబ్ కు పేరుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో విబేధాల కారణంగా  ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. స్వంతంగా పార్టీని ఏర్పాటు చేసుకొన్నాడు. ఆ తర్వాత తన పార్టీని ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు.