Asianet News TeluguAsianet News Telugu

ప్రణబ్ ముఖర్జీ మృతి: ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

India announces 7 days of State Mourning in memory of former President Pranab Mukherjee
Author
New Delhi, First Published Aug 31, 2020, 8:12 PM IST


న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇవాళ్టి నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడు రోజుల పాటు జాతీయ పతాకాలను అవనతం చేయనున్నారు. అంత్యక్రియలు ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తారనే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయాన్ని తర్వాత ప్రకటించనున్నట్టుగా తెలిపారు.

also read:కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి: ప్రణబ్ కీలక పాత్ర

రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను అవనతం చేయాలని కేంద్రం ఆదేశించింది.అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది.

అనారోగ్యంతో ఈ నెల మొదటివారంలో ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ముఖర్జీ చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మరణించాడు. ప్రణబ్ ముఖర్జీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడుగా పేరుంది.కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా ప్రణబ్ కు పేరుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios