Agneepath Yojana: అగ్నిపథ్ యోజనపై బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సినీన‌టుడు. రాజ‌కీయ నాయ‌కుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. అగ్నిపథ్ పథకంపై ప్రకాష్ రాజ్ ప్రశ్నలు సంధించారు 

Agneepath Yojana: అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకంపై ఓ వైపు ఆందోళనలు కొనసాగుతున్నా.. కేంద్రం త‌న పట్టుదల వీడ‌వ‌టం లేదు. అగ్నివీరుల నియామక ప్రక్రియ నెలరోజుల్లో ప్రారంభిస్తామని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య‌ల వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీ కార్యాలయానికి సెక్యూరిటీ అవసరమైతే అగ్నివీరులకు తాను ప్రాధాన్యం ఇస్తామ‌ని విజయవర్గీయ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. అలాగే... కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు కూడా సంచ‌ల‌నంగా మారాయి. ఇరు నేత‌ల వ్యాఖ్యలను కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన, ఏఐఎంఐఎం నేతలు తప్పుపట్టారు.

కాగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు నేతల వ్యాఖ్య‌ల‌పై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. దీని కింద ప్రకాష్ రాజ్ అగ్నివీరులపై చేసిన ప్రకటనపై మోడీ ప్రభుత్వాన్ని విమ‌ర్శించారు. ఈ పథకంపై ప్రకాష్ రాజ్ ప్రశ్నలు సంధించారు. 'అగ్నీపథ్ పథకం కింద 4 ఏళ్లపాటు సైన్యంలో రిక్రూట్ అయిన అగ్నివీరులు తర్వాత మంచి చాకలి, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, బార్బర్‌లుగా మారవచ్చు' అని కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఇటీవల అన్నారు. మరోవైపు.. కైలాష్ విజయవర్గియా కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. నాలుగు సంవ‌త్స‌రాల అనంత‌రం అగ్ని వీరులు భార‌తీయ జనతా పార్టీ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తారనిస సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. 

ప్రకాష్ రాజ్ తన ట్వీట్ట‌ర్ వేదిక‌గా ఇరునేత‌ల ప్ర‌క‌ట‌న‌ల‌ను చూపిస్తూ.. 'గౌరవనీయులైన సుప్రీం.. అగ్నివీరుల భవిష్యత్తుపై మీ స్వంత పార్టీ నేత‌లు ఏమి చెబుతున్నారో చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యువత ఎలా స్పందిస్తారని అనుకోవచ్చు. విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని బీజేపీ నేతలిద్దరినీ ప్రకాష్ రాజ్ దుయ్యబట్టారు.

Scroll to load tweet…

సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్‌కి మద్దతు

ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ కు సోషల్ మీడియాలో భారీ మొత్తంలో మద్దతు లభిస్తోంది. ప్ర‌కాశ్ పోస్టుకు స‌పోర్టుగా..ఓ ట్విట్టర్ వినియోగదారు ట్వీట్ చేశాడు. బీజేపీ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగమా ? అని రాశారు. లేదంటే.. భవిష్యత్తులో భాజపా ఖజానా నుంచి గార్డులకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మరొక వినియోగదారు ఈ నాయకుల ప్రకటనలను అసంబద్ధంగా ఉన్నాయ‌ని కొట్టిపారేశారు. ఇలాంటి రియాక్షన్స్ ఎన్నో సోషల్ మీడియాలో వెల్లువెత్తున్నాయి.