చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 3 లోని ప్రజ్ఞాన్ రోవర్ 100 మీటర్లకు పైగా ప్రయాణించిందని ఇస్రో పేర్కొంది.
జాబిల్లి గుట్టు రట్టు చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయింది. ఈ మిషన్ లోని లోని లాండర్ రోవర్లు చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో విక్రమ్ ల్యాండర్ నుండి బయటకు వచ్చిన ప్రజ్ఞన్ రోవర్ బయటకు వచ్చి తన పనిని తాను చేసుకుంటూ వెళుతుంది. ఈ తరుణంలో ప్రజ్ఞాన్ రోవర్ సరికొత్త ల్యాండ్ మార్కును క్రియేట్ చేసింది. చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయిన రోజు నుండి ఇప్పటివరకు 100 మీటర్లకు పైగా ప్రయాణించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది.
ఇది తన ప్రయాణంలో మరింత ముందుకు వెళ్తుందని తెలిపింది. ఈ సందర్భంగా రోవర్ ప్రయాణించిన మార్గానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ.. ప్రజ్ఞాన్ రోవర్ సెంచరీ కొట్టినట్లు ఫన్నీగా పేర్కొంది.
మరోవైపు చంద్రునిపై రాత్రి సమయం సమీపిస్తున్న తరుణంలో ఇస్రో అప్రమత్తమైంది. రాత్రి తట్టుకునేందుకు వీలుగా రోవర్ లాండర్ లను నిద్రాణ స్థితిలో చేర్చే ప్రక్రియ రానున్న రెండు రోజులలో ప్రారంభమవుతుందని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. చంద్ర అన్వేషణలో భాగంగా చంద్రయాన్ 3 లో విక్రమ్ లాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు అనుకున్న విధంగా పనిచేస్తున్నాయని, వాటిలోని పేలోడ్ లు చంద్రునిపై విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే చాలా విలువైన సమాచారాన్ని అందించాలని తెలిపారు .
